PhonePe Logo
phonepe logo
Business SolutionsPressCareersAbout UsBlogContact UsTrust & Safety
hamburger menu
✕
HomeBusiness SolutionsPressCareersAbout UsBlogContact UsTrust & Safety
Privacy Policy

PhonePe వాలెట్ వినియోగ నియమాలు

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
< Back
  • వాలెట్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, కాలానుగుణంగా చేసిన సవరణలు, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ద్వారా సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన సవరించిన నిబంధనలు, దీని లోని వర్తించే నియమాల ప్రకారం రూపొందించిన ఈ డాక్యుమెంట్‌‌ను ఎలక్ట్రానిక్ రికార్డ్‌గా పరిగణిస్తారు. ఇది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా జెనరేట్ అయింది. దీనికి ఎటువంటి ఫిజికల్ సంతకాలు (నేరుగా చేసిన సంతకాలు) గానీ, డిజిటల్ సంతకాలు గానీ అవసరం లేదు.

PhonePe వాలెట్‌ను (ఈ కిందన నిర్వచనం ఇచ్చాము) రిజిస్టర్ చేసే ముందు, యాక్సెస్ చేసేటప్పుడు లేదా వినియోగించే ముందు దయచేసి వినియోగ నియమాలను జాగ్రత్తగా చదవండి. ఈ నియమాలు, షరతులు (ఇకపై వీటిని “Wallet ToUs/వాలెట్ వినియోగ నియామాలు” అని పిలుస్తారు) అనేవి PhonePe వాలెట్ ద్వారా PhonePe ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న మీ స్మాల్ PPIలు, అలానే పుల్-KYC PPIలు లేదా ఎప్పటికప్పుడు జోడించే ఇతర సేవల వినియోగాన్ని నియంత్రిస్తాయి. PhonePe ప్రైవేట్ లిమిటెడ్ తన కార్యాలయాన్ని ఆఫీస్-2, ఫ్లోర్ 4,5,6,7, వింగ్ A, బ్లాక్ A, సలార్పురియా సాఫ్ట్‌జోన్ సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లేఅవుట్, బెల్లందూర్, బెంగళూరు, సౌత్ బెంగళూరు, కర్ణాటక – 560103, భారత్ (“PhonePe”) చిరునామాలో రిజిస్టర్ చేసింది. పేమెంట్, సెటిల్‌మెంట్‌ల చట్టం, 2007లోని నియమాలకు అనుగుణంగా, అలానే RBI ఎప్పటికప్పుడు జారీ చేసే నిబంధనలు, ఆదేశాలకు అనుగుణంగా ఈ సేవలను అందించేందుకు PhonePeకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (“RBI”) అధికారం ఇచ్చింది.

PhonePe వాలెట్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు సాధారణ PhonePe నియమాలు, షరతులు (“General ToU/సాధారణ వినియోగ నియమాలు“), PhonePe “ప్రైవసీ పాలసీ“, అలానే PhonePe గ్రీవెన్స్ పాలసీ (సమిష్టిగా “ఒప్పందం” అని సూచిస్తారు)ని అంగీకరించడంతో పాటు ఈ వాలెట్ వినియోగ నియమాలకు కట్టుబడి ఉండటానికి మీ సమ్మతిని తెలియ చేస్తున్నారు. PhonePe వాలెట్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు PhonePeతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అలానే ఈ ఒప్పందం మీకు, PhonePeకు మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఏర్పాటు చేస్తుంది. వాలెట్ వినియోగ నియమాల విషయానికి వచ్చేసరికి, సందర్భాన్ని బట్టి అవసరమైన చోట, “మీరు”, “వినియోగదారు”, “మీ” అనే పదాలు PhonePe వారి PhonePe వాలెట్‌లో రిజిస్టర్ చేసుకున్న PPI హోల్డర్‌ను సూచిస్తుంది, అలానే  “మేము”, “మా” “జారీ చేసిన వారు” అనే పదాలు PhonePeను సూచిస్తాయి. మీరు ఒప్పందం నియమాలు, షరతులను అంగీకరించకపోయినా లేదా ఒప్పందం నియమాలు, షరతులకు కట్టుబడి ఉండకూడదనుకున్నా, మీరు PhonePe వాలెట్‌ను వాడకూడదు మరియు/లేదా వెంటనే PhonePe వాలెట్‌ను క్లోజ్ చేయండి.

PhonePe వెబ్‌సైట్(లు), మొబైల్ అప్లికేషన్‌లో (ఇకపై సమిష్టిగా దాన్ని “PhonePe ప్లాట్‌ఫామ్”గా సూచిస్తారు) అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేయడం ద్వారా ఒప్పందంలోని ఏవైనా నియమాలు, షరతులు లేదా వాలెట్ వినియోగ నియమాలతో సహా ఒప్పందంలోని ఏదైనా భాగాన్ని సవరించవచ్చు. ఒప్పందానికి సంబంధించిన అప్‌డేట్ చేసిన వెర్షన్ లేదా వాలెట్ వినియోగ నియమాలు అన్నీ వాటిని పోస్ట్ చేసిన వెంటనే అమలులోకి వస్తాయి. అప్‌డేట్‌లు / మార్పుల కోసం కాలానుగుణంగా ఒప్పందాన్ని సమీక్షించాల్సిన బాధ్యత మీదే. మార్పులను పోస్ట్ చేసిన తర్వాత PhonePe వాలెట్‌ వినియోగాన్ని కొనసాగించడం ద్వారా మీరు అదనపు నియమాలు, షరతులు, సవరణలు మరియు/లేదా ఒప్పందంలోని భాగాల తొలగింపుతో సహా అన్ని మార్పులను మీరు ఆమోదించారని, అలానే సమ్మతి తెలిపారని అర్థం. మీరు ఈ వాలెట్ వినియోగ నియమాలకు కట్టుబడి ఉన్నంత వరకు, PhonePe వాలెట్‌ను వినియోగించేందుకు మీకు వ్యక్తిగత, ప్రత్యేకం కాని, బదిలీ చేయలేని, పరిమిత హక్కును మేము మంజూరు చేస్తాము.

వాలెట్

arrow icon

నిర్వచనం

“PhonePe వాలెట్”: RBI నిర్వచించిన నిబంధనలు, విధానాల ప్రకారం PhonePe జారీ చేసిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్(స్మాల్ PPI) లేదా ఫుల్ KYC ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (“ఫుల్ KYC PPI”) లేదా ఫుల్ KYC వాలెట్ నాన్ ఫేస్-టు-ఫేస్-ఆధార్ OTP ఆధారిత (“ఫుల్ KYC-నాన్ F2F వాలెట్), వర్తించే మేరకు,

“రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తులు (PEPలు)“: రాష్ట్రాలు/ప్రభుత్వాల అధిపతులు, సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ ప్రభుత్వ లేదా న్యాయ లేదా సైనిక అధికారులు, రాష్ట్ర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లు, ముఖ్యమైన రాజకీయ పార్టీ అధికారులు సహా విదేశీ ప్రభుత్వం నియమించిన వ్యక్తులు లేదా విదేశీ ప్రభుత్వం ద్వారా కీలక ప్రభుత్వ బాధ్యతలు పొందిన వ్యక్తులు.

“మర్చెంట్”: వస్తువులు మరియు/లేదా సేవలను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌‌‌లో కొనుగోలు చేసేందుకు PhonePe వాలెట్‌ను పేమెంట్ పద్ధతిగా అంగీకరించే ఏదైనా ఎస్టాబ్లిష్‌మెంట్ మరియు/లేదా సంస్థ అని అర్థం. అదేవిధంగా, “కొనుగోలుదారు” అనే పదం, ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో వ్యాపారులు అందించిన ఏవైనా వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసి, అలాంటి వస్తువులు/సేవలకు PhonePe వాలెట్‌ ద్వారా చెల్లించే వ్యక్తిని సూచిస్తుంది.

“PhonePe – సింగిల్ సైన్ ఆన్ (P-SSO)” అనేది మీకు అందిస్తున్న PhonePe లాగిన్ సేవను సూచిస్తుంది, ఇది మీ సురక్షితమైన, ప్రత్యేకమైన క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించి PhonePe అప్లికేషన్‌లో అందిస్తున్న సేవలు అన్నింటినీ యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది.

అర్హత

PhonePe వాలెట్‌లో రిజిస్టర్ చేసుకోవడం కోసం, మీకు ఈ కింద అర్హతలు ఉన్నాయి అని చెబుతున్నారు: –

  • చెల్లుబాటు అయ్యే PhonePe అకౌంట్‌ను కలిగి ఉన్న భారతీయ నివాసి.PhonePe వాలెట్‌లో రిజిస్టర్ చేసుకోవడం కోసం, మీకు ఈ కింద అర్హతలు ఉన్నాయి అని చెబుతున్నారు:
  • ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఉన్న అర్థం ప్రకారం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సహజమైన లేదా చట్టపరమైన వ్యక్తి.
  • మీరు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
  • ఒప్పందంలోని అన్ని అవసరాలను బట్టి ఈ ఒప్పందంలోకి ప్రవేశించడానికి మీకు హక్కు, అధికారం, సామర్థ్యం ఉంది.
  • భారతదేశ చట్టాల ప్రకారం PhonePe లేదా PhonePe ఎంటిటీల సేవల యాక్సెస్ చేసే లేదా వినియోగించే విషయంలో మీపై నిషేధం విధించలేదు లేదా చట్టబద్ధంగా మిమ్మల్ని నిషేధించలేదు.
  • RBI నిర్వచనం ప్రకారం ప్రస్తుతం మీరు రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తి (“PEP”) కాదని ప్రకటిస్తున్నారు.

మీరు ఏ వ్యక్తి లేదా సంస్థ వలె నటించకూడదు లేదా ఏదైనా వ్యక్తి లేదా సంస్థతో మీ వయస్సు లేదా అనుబంధాన్ని తప్పుగా పేర్కొనకూడదు. PhonePe మీ ఒప్పందాన్ని ముగించే హక్కును కలిగి ఉంటుంది, అలానే ఇక్కడ పేర్కొన్న షరతులకు సంబంధించి ఏదైనా తప్పుగా తెలిపినట్లయితే మీ వాలెట్‌ను PhonePe క్లోజ్ చేస్తుంది.

మీ PEP స్టేటస్ మారినప్పుడు లేదా మీరు PEPతో సంబంధం ఉన్నట్లుగా తెలిసిన పరిస్థితులలో PhonePeకు వెంటనే తెలియచేయడానికి మీరు అంగీకరిస్తున్నారు, దానికి బాధ్యత వహిస్తారు. వర్తించే చట్టాలు, PhonePe విధానానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకున్నట్లు నిర్ధారించుకోవడం కోసం మీరు వెంటనే PhonePeకు రాతపూర్వకంగా తెలియచేయాలి. సంబంధిత నియంత్రణ సంస్థలు నిర్ణయించిన విధంగా, PEP స్థాయిలో మీరు అదనపు కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అవసరాలకు లోబడి ఉంటారని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీ PhonePe వాలెట్‌‌ వినియోగం నిరంతరాయంగా కొనసాగడాన్ని నిర్ధారించడం కోసం PhonePe మీకు తెలిపిన సమాచారం మేరకు PEPకి వర్తించే అన్ని నిరంతర సమ్మతి అవసరాలను పూర్తి చేసే విషయంలో PhonePeకు సహకరించడానికి, అలానే PEPగా, పైన పేర్కొన్న అన్ని అదనపు కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అవసరాలకు పూర్తిగా కట్టుబడి ఉండటానికి ఇందుమూలంగా అంగీకారం తెలుపుతున్నారు.

మీ PEP స్టేటస్‌ను ప్రకటించడానికి, దయచేసి ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసి, నింపిన తర్వాత, ఇక్కడ ఉన్న సహాయ విభాగంలోకి అప్‌లోడ్ చేయండి

PhonePe వాలెట్‌ జారీ ప్రక్రియకు డ్యూ డిలిజెన్స్ చేయాల్సిన అవసరం పడవచ్చు, ఇందులో PhonePe వాలెట్ అప్లికేషన్‌లో భాగంగా మీరు అందించిన క్రెడెన్షియల్స్‌ను అంతర్గతంగా లేదా ఇతర వ్యాపార భాగస్వాములు / సేవా ప్రదాతల సహకారంతో సమీక్షించడానికి, ధృవీకరించడానికి, నియంత్రణ సంస్థలు సూచించిన మేరకు చెక్ చేయడం కోసం ఆదేశాలు జారీ చేయడానికి, మా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌ చేయడానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చు, అలానే మీకు PhonePe వాలెట్‌ను జారీ చేసే  సంపూర్ణ విచక్షణాధికారం PhonePeకు ఉంటుంది. అందువల్ల, అవసరమైన డేటాను షేర్ చేసినంత మాత్రాన PhonePe వాలెట్ హోల్డర్‌గా మారడానికి మీరు అర్హత సాధించరు.

PhonePe వాలెట్ దరఖాస్తు, జారీ ప్రక్రియ

  • ఆర్థిక సంస్థలు తమ క్లయింట్‌ల గుర్తింపును నిర్ధారించడానికి KYC లేదా “మీ కస్టమర్‌ను తెలుసుకోండి” ప్రక్రియను నిర్వహిస్తాయి. ఆ క్లయింట్‌లు ఎవరైనా మనీలాండరింగ్ లేదా టెర్రరిస్ట్ ఫండింగ్‌లో పాల్గొనే ప్రమాదాన్ని నిర్ణయిస్తాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా తమ ఖాతాదారుల KYCని అడగాలని (RBI) ఆదేశించింది. PhonePe వాలెట్‌ సర్వీసును మీరు పొందేందుకు చేసుకునే దరఖాస్తులో భాగంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్‌లు, సమాచారాన్ని మేము సేకరించవచ్చు, అలానే ఆ సమాచార సేకరణ, వినియోగం PhonePe ప్రైవసీ పాలసీ, PhonePe అంతర్గత విధానాలు, నియంత్రణ సంస్థల ఆదేశాలు, నోటిఫికేషన్‌లకు లోబడి ఉంటుంది, కానీ ఇది అలాంటి నియంత్రణ సంస్థలు నిర్వచించిన విధానాలకు మాత్రమే పరిమితం కాదు. ,.
  • మీ PhonePe వాలెట్ దరఖాస్తు, ఆన్‌బోర్డింగ్ లేదా అప్‌డేట్‌లో భాగంగా, మీ దరఖాస్తు ప్రక్రియ కోసం ఉపయోగించే థర్డ్ పార్టీ నియమాలు, షరతులను కూడా మీరు అంగీకరించాల్సి ఉంటుంది, ఉదాహరణకు, మీరు UIDAI లేదా మీ డేటా/సమాచారాన్ని మాకు షేర్ చేసేందుకు అనుమతి పొందిన అధికారిక సంస్థ నియమాలు, షరతులను ఆమోదించాల్సి రావచ్చు.
  • .PhonePeకి మీరు సమర్పించిన మీ వివరాలు, మీ ఇంటి వివరాలు, దాని ట్యాక్స్ స్టేటస్, PEP గురించిన సమాచారం, మీ KYC డాక్యుమెంట్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మెటీరియల్ సమాచారం కోసం అందించిన డాక్యుమెంట్‌లు/సమాచారం, అలానే డిక్లరేషన్‌లకు మీరే బాధ్యత వహించాలి. డాక్యుమెంట్‌లు/సమాచారం, డిక్లరేషన్‌లలో ఏవైనా తప్పులుంటే దానికి PhonePe బాధ్యత వహించదు. వాలెట్ యాక్టివేషన్‌ను తిరస్కరించే హక్కు, మీ PhonePe వాలెట్‌ను డీయాక్టివేట్ చేసే హక్కు PhonePeకు ఉంది. అలానే ఆ డీయాక్టివేషన్ గురించి ప్రస్తుత ఆదేశాల ప్రకారం లీగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు (LEAలు), నియంత్రణ సంస్థ(లు)కు నివేదించవచ్చు.
  • PhonePe వాలెట్‌ను జారీ చేసే ముందు మేము మీరు ఇచ్చిన డేటా/సమాచారాన్ని సమీక్షించవచ్చు, అలానే RBI లేదా RBI జారీ చేసిన మీ కస్టమర్‌ను తెలుసుకోండి మార్గనిర్దేశాలు, 2016 (“KYC మార్గదర్శకాలు”),  మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (“PMLA”), మనీ-లాండరింగ్ (రికార్డుల నిర్వహణ) నిరోధక నిబంధనలు, 2005, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌లకు సంబంధించి RBI జారీ చేసిన ప్రధాన ఆదేశాలు, 2021, వాలెట్‌కు వర్తించేలా ఏదైనా ఇతర నియంత్రణ సంస్థ PhonePeకు ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రిస్క్ మేనేజ్‌మెంట్‌తో సహా డ్యూ డిలిజెన్స్ చర్యలను మేము తీసుకోవచ్చు. నేర నిరోధక చర్యలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పబ్లిక్‌లో అందుబాటులో ఉన్న ఇతర సోర్సుల నుండి లేదా మా వ్యాపార భాగస్వాములు లేదా సర్వీసు ప్రొవైడర్‌ల  నుంచి కూడా మీకు సంబంధించిన డేటాను పొందవచ్చు.
  • PhonePe వాలెట్ దరఖాస్తు, అప్‌గ్రేడ్ లేదా రిస్క్ అసెస్‌మెంట్‌లో భాగంగా మీ KYC సమాచారం/డేటాను సేకరించడానికి మేము అసోసియేట్‌లను లేదా ఏజెంట్‌లను నియమించవచ్చు.
  • మీరు కనీస KYC (స్వీయ-ప్రకటన) ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీ KYC స్టేటస్ ‘కనీస KYC’గా అప్‌డేట్ అవుతుంది. అలానే మీరు స్మాల్ PPI PhonePe వాలెట్‌ను ఉపయోగించడానికి అర్హత పొందుతారు. అయితే, పూర్తి స్థాయి PhonePe వాలెట్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందాలంటే, మీరు తప్పనిసరిగా ‘ఫుల్ KYC’ ప్రక్రియను పూర్తి చేయాలి. కనీస KYC అకౌంట్‌ను ఫుల్ KYC అకౌంట్‌కు అప్‌గ్రేడ్ చేయడం అనేది తప్పనిసరి కాదు, దీన్ని పూర్తిగా మీ ఇష్టం మేరకు చేసుకోవచ్చు.

PhonePe వాలెట్‌లు

PhonePe ఖాతాదారులకు స్మాల్ PPI, ఫుల్ KYC PPIని PhonePe జారీ చేస్తుంది. ఈ విభాగం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, 2021 (“MD-PPIs, 2021”), అలానే తదుపరి అప్‌డేట్‌లకు సంబంధించిన మాస్టర్ డైరెక్షన్‌ల కింద RBI జారీ చేసిన రెగ్యులేటరీ ఆదేశాలకు అనుగుణంగా మేము జారీ చేసిన PhonePe వాలెట్‌ల వివిధ కేటగిరీలను సూచిస్తుంది.

  • స్మాల్ PPI లేదా కనీస వివరాల PPI (నగదు లోడింగ్ సౌకర్యం లేనిది)
    స్మాల్ PPI (నగదు లోడింగ్ సౌకర్యం లేనిది) ఈ కేటగిరీ కింద జారీ చేసిన PhonePe వాలెట్‌లను ఈ కిందన పేర్కొన్న ఫీచర్‌లు, పరిమితులు ఉన్న MD-PPIs 2021 పేరా 9.1 (ii) ప్రకారం నిర్వహిస్తారు.
    1. ఈ PhonePe వాలెట్‌ను పొందడానికి, మీ వద్ద భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు  జారీ చేసిన, OTPతో ధృవీకరించిన యాక్టివ్‌ మొబైల్ నంబర్‌ ఉండాలి. మీ పేరును మీరు స్వయంగా ప్రకటిస్తున్నట్లుగా సెల్ఫ్-డిక్లరేషన్‌తో పాటు ఏదైనా ‘తప్పనిసరి పత్రం’లోని ప్రత్యేక గుర్తింపు/గుర్తింపు సంఖ్యను సమర్పించాలి లేదా KYC మార్గదర్శకాలలోని జాబితాలో ఉన్న ‘అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రం’ (“OVD”)ను ఇవ్వాలి. మీ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా PhonePe మీకు ఆమోదయోగ్యమైన పత్రాల జాబితాను అందిస్తుంది.
    2. మీ PhonePe వాలెట్‌ను రీలోడ్ చేసుకోవచ్చు, ఇది ఎలక్ట్రానిక్ రూపంలో జారీ అవుతుంది PhonePe అంతర్గత విధానాల ప్రకారం, నియంత్రణ సంస్థ అనుమతించిన మీ బ్యాంక్ అకౌంట్ మరియు / లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి లోడ్ చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది.
    3. మీ PhonePe వాలెట్‌కు లోడింగ్ పరిమితులు వర్తిస్తాయి, నెలవారీ పరిమితి రూ. 10,000/-, అలానే వార్షిక పరిమితి (ఆర్థిక సంవత్సరం ఆధారంగా లెక్కిస్తారు) రూ. 1,20,000/-. ఇంతేకాక, మీ PhonePe వాలెట్‌లో ఏ సమయంలోనైనా (“స్మాల్ PPI పరిమితి”) ఉండాల్సిన బ్యాలెన్స్‌ గరిష్ఠ పరిమితి రూ.10,000/-, ఇంకా మీ వాలెట్‌లోని నిధులు స్మాల్ PPI పరిమితిని చేరుకున్నట్లయితే, మీ PhonePe వాలెట్‌లో ఎలాంటి నిధులు క్రెడిట్ కావు. అయితే, లావాదేవీలు ఏవైనా రద్దు అయ్యి రీఫండ్ వచ్చినప్పుడు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. అలా రీఫండ్ క్రెడిట్ అయినప్పుడు PhonePe వాలెట్‌లోని బ్యాలెన్స్‌ రూ. 10,000/- పరిమితి కంటే పెరగవచ్చు.
    4. మీ PhonePe వాలెట్ బ్యాలెన్స్‌ను ఏవైనా నిధుల బదిలీకి లేదా ఏదైనా రూపంలో నగదును విత్‌డ్రా చేయడానికి ఉపయోగించలేరు.
    5. మీరు వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి మాత్రమే PhonePe వాలెట్ బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చు.
    6. మర్చెంట్ / మర్చెంట్‌ ప్లాట్‌ఫామ్‌కు పేమెంట్ చేసేటప్పుడు మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్లలో PhonePe వాలెట్ కూడా ఉంటుంది. PhonePe వాలెట్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన ప్రోడక్ట్‌లు లేదా సేవలకు మేము ఎటువంటి బాధ్యత వహించము, దానికి సంబంధించిన ఎటువంటి భారాన్ని భరించేది లేదని స్పష్టంగా తెలియ చేస్తున్నాము. PhonePe వాలెట్‌లో అందుబాటులో ఉన్న మొత్తం కంటే ఆర్డర్ విలువ ఎక్కువగా ఉంటే, యూజర్ అతని/ఆమె PhonePe అకౌంట్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుండి నేరుగా చెల్లించవచ్చు
    7. PhonePe వాలెట్ జారీ సమయంలో వాలెట్ ఫీచర్లను SMS/ఈ-మెయిల్/నియమ, నిబంధనలకు ఉన్న లింక్‌ను పంపించి లేదా ఏదైనా ఇతర మార్గాల ద్వారా PhonePe తెలియజేస్తుంది.
    8. మీరు లాగిన్ చేయడానికి, మీ PhonePe వాలెట్‌ను యాక్సెస్ చేయడానికి మీ P-SSOను ఉపయోగించాలి. మీ PhonePe అకౌంట్ యాక్సెస్ చేయడానికి మీ నుంచి అదనపు భద్రతా చర్యలను మేము కోరవచ్చు/అందించవచ్చు.
    9. మీరు PhonePe వాలెట్ ద్వారా నిర్వహించే లావాదేవీలకు పరిమితిని నిర్దేశించే ఆప్షన్‌ను PhonePe మీకు అందిస్తోంది, ఇంకా మీరు ఏ సమయంలోనైనా ఆథంటికేషన్ అనే అదనపు ఫ్యాక్టర్‌ను ఉపయోగించి ఆ పరిమితిని మార్చుకోవచ్చు.
    10. ఇక్కడ పేర్కొన్న ఫీచర్‌లు, పరిమితులు PhonePe అంతర్గత రిస్క్ అసెస్‌మెంట్‌కు లోబడి ఉంటాయి, అలానే మేము లోడ్‌, ఖర్చు పరిమితులను తగ్గించవచ్చు, నిధులను లోడ్ చేసిన వెంటనే మీ PhonePe వాలెట్‌కు కూలింగ్ పీరియడన్‌ను అప్లై చేయవచ్చు, ఇంకా నిర్దిష్ట మర్చెంట్‌ల వద్ద చేసే ఖర్చుపై పరిమితిని విధించవచ్చు, మీ PhonePe వాలెట్‌ను మీరు యాక్సెస్ చేయకుండా నిలిపివేయవచ్చు లేదా మీ అకౌంట్‌ గురించి లీగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు (“LEA”) లేదా ఇతర నియంత్రణ సంస్థలకు తెలియచేయవచ్చు. పైన పేర్కొన్న వాటిలో ఏదైనా చర్య తీసుకున్నప్పుడు మీకు తెలియచేయవచ్చు లేదా తెలియచేయకపోవచ్చు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇది మా యూజర్‌లు, వ్యాపారుల కోసం మీ PhonePe వాలెట్‌లు, ఎకోసిస్టమ్‌ను సురక్షితంగా ఉంచేందుకు మేము నిర్వహించే ట్రాన్సాక్షనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్‌లో ఒక భాగం.
    11. ఒకవేళ మీరు డిసెంబర్ 24, 2019కి ముందు నుంచే PhonePe వాలెట్‌ను కలిగి ఉండి, దాని స్టేటస్ “ఇన్‌యాక్టివ్”గా ఉన్నట్లయితే, మీరు యాక్టివేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత మీ PhonePe వాలెట్ యాక్టివేట్ అయిన వెంటనే ఈ కేటగిరీ(స్మాల్ PPIs)కి చెందిన PhonePe వాలెట్‌గా మారుతుంది. ఈ కేటగిరీకి వర్తించే ఫీచర్లు, పరిమితులు మాత్రమే దీనికి వర్తిస్తాయి. యాక్టివేషన్ సమయంలోనే ఈ మైగ్రేషన్ వెంటనే పూర్తయ్యే అవకాశముంది.
    12. ఒకవేళ మీరు మీ PhonePe వాలెట్‌ను క్లోజ్ చేయాలని నిర్ణయించుకుంటే, మీ PhonePe వాలెట్‌లో కొంత నిధులు ఉన్నట్లయితే, మీ PhonePe వాలెట్ మూసివేత ప్రక్రియలో భాగంగా ఆ నిధులను నగదు లోడ్ చేసేందుకు ఉపయోగించిన సోర్సు అకౌంట్‌కు తిరిగి పంపిస్తాము.
  • పూర్తి KYC PPI
    ఈ కేటగిరీ కింద జారీ చేసిన పూర్తి KYC PPI PhonePe వాలెట్లను, ఈ కింద పేర్కొన్న ఫీచర్లు, పరిమితులు ఉన్న MD-PPIs, 2021లోని పేరా 9.2 ప్రకారం నిర్వహిస్తారు. PhonePe అనుమతించిన మేరకు, PhonePe నిర్వచించిన ప్రక్రియ ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అందించి, మీ స్మాల్ PPI PhonePe వాలెట్‌ను పూర్తి KYC PPI PhonePe వాలెట్ (“పూర్తి KYC వాలెట్”)గా అప్‌గ్రేడ్ చేయవచ్చు.
  1. భారతీయ పౌరులకు, భారతదేశంలో పన్ను చెల్లిస్తూ నివసిస్తున్నవారికి, భారతీయ నివాసితులకు మాత్రమే ఫుల్ KYC వాలెట్ అందుబాటులో ఉంటుంది. ఫుల్ KYC PPI కోసం దరఖాస్తు చేయడం ద్వారా, మీరు భారతదేశంలో పన్ను చెల్లిస్తూ నివసిస్తున్నారని, మరే ఇతర దేశం నివాసి కాదని ప్రకటిస్తున్నారు.
  2. ఈ PhonePe వాలెట్‌ను పొందడానికి, మీ వద్ద భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు  జారీ చేసిన, OTPతో ధృవీకరించిన యాక్టివ్‌ మొబైల్ నంబర్‌ ఉండాలి. ఇంకా డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ (DoR), RBI జారీ చేసిన ‘మీ కస్టమర్‌ను తెలుసుకోండి (KYC) / మనీ లాండరింగ్ నిరోధక (AML) / ఉగ్రవాదులకు ఆర్థిక సహకారాన్ని అడ్డుకునే (CFT) మార్గదర్శకాలు, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసిన తమ KYC మార్గదర్శకాలు, అలానే నియంత్రణ సంస్థల మార్గదర్శకాలు ఆధారంగా PhonePe నిర్వచించిన ప్రక్రియ ప్రకారంగా మీరు KYC ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలి.
  3. KYC అవసరాలను నియంత్రణ సంస్థ(లు) నిర్వచిస్తాయి, అలానే ఎప్పటికప్పుడు అవి అప్‌డేట్ అవుతాయి. అంతేకాక నియంత్రణ సంస్థ అనుమతించిన మేరకు వివిధ సోర్సుల నుండి మీ KYC డేటాను కూడా పొందవచ్చు. అటువంటి సందర్భంలో, మీరు ఆ డేటాను పొందే అధికారం PhonePeకు మీరు ఇవ్వాలి, ఇంకా మీ KYC సర్వీస్ ప్రొవైడర్ నియమాలు, షరతులు, దాని డేటా షేరింగ్ నియమాలను ఖచ్చితంగా అంగీకరించాలి. ఉదాహరణకు, KYC ప్రాసెస్‌లో భాగంగా e-KYC ప్రక్రియ లేదా UIDAI ఆఫ్‌లైన్ ఆధార్ ధృవీకరణ ప్రక్రియ ద్వారా మీ KYC డాక్యుమెంట్‌లను మాకు షేర్ చేసేందుకు మేము మిమ్మల్ని ఎనేబుల్ చేయొచ్చు, అలానే ఏదైనా ఇతర అభివృద్ధి చెందుతున్న, అనుమతించతగిన సోర్స్ నుంచి కూడా మేము వాటిని కోరవచ్చు. అయితే, KYCకి అలాంటి నిబంధనలను ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే అవి వర్తిస్తాయి.
  4. కింద ఉన్న ప్రక్రియను పూర్తి చేసినట్లయితే మీ ప్రస్తుత PhonePe వాలెట్‌ను ఫుల్ KYC వాలెట్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి మీరు అర్హత సాధిస్తారు:
    • ఆధార్, PAN ధృవీకరణ: మీ ఆధార్, PAN ధృవీకరణలను పూర్తి చేయండి (“ఆధార్-PAN ధృవీకరణ”). ఆధార్-PAN ధృవీకరణ పూర్తయిన తర్వాత, అవసరమైనంత మేరకు, మీ అదనపు వ్యక్తిగత వివరాలను అందించాలి.
    • వీడియో ధృవీకరణ: ఫుల్ KYC ప్రాసెస్‌ను పూర్తి చేయడం కోసం రెండవ దశలో, మీరు వీడియో ధృవీకరణ చేయించుకోవాలి. దీనిలో మీకు, PhonePe ప్రతినిధికి మధ్య వీడియో కాల్ ఉంటుంది. ఈ వీడియో ధృవీకరణ కాల్‌లో, మీరు కొన్ని వివరాలను తెలపాలి, అలానే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
  5. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు/లేదా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), ఆథంటికేషన్‌తో పాటు PhonePe వాలెట్ సర్వీసులను అందించడం కోసం మీరు PhonePeకు షేర్ చేసిన వివరాల నుండి మీ గుర్తింపు, జనాభా వివరాలను (KYC వివరాలు, అంటే మీ కస్టమర్‌ను తెలుసుకోండి) సేకరించడానికి/పొందడానికి/మళ్లీ పొందడానికి, ధృవీకరించడానికి/చెక్ చేయడానికి PhonePeకు మీరు అధికారం ఇస్తున్నారని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఇదే విషయంలో, ఈ కిందన పేర్కొన్న అంశాలకు కూడా మీరు సమ్మతిని తెలియచేస్తున్నారు:
    • PhonePeలో ఆధార్ ఆథంటికేషన్ కోసం UIDAIకు మీ వివరాలను షేర్ చేయడానికి.
    • UIDAI నుండి మీ గుర్తింపు, జనాభా సమాచారాన్ని PhonePe సేకరించడానికి.
    • వర్తించే చట్టాల ప్రకారం [సెంట్రల్ KYC రికార్డ్ రిజిస్ట్రీ లేదా PAN ధృవీకరణ సేవలకు సహా (NSDL/ CDSL లేదా ఏదైనా ఇతర అనుమతి పొందిన ఏజెన్సీ ద్వారా)] మీ ఆథంటికేషన్ స్టేటస్/ గుర్తింపు /జనాభా వివరాలను ఏదైనా ఇతర రెగ్యులేటరీ అథారిటీకి సమర్పించడానికి.
    • మీ రిజిస్టర్డ్ నంబర్/ఈమెయిల్ చిరునామాకు UIDAI / PhonePe, ఇంకా తన ద్వారా అనుమతి పొందిన ఏదైనా ఏజెన్సీ నుండి SMS/ఈమెయిల్ పంపించేందుకు.

దీనికి అనుగుణంగా, ఈ కింద పేర్కొన్న వాటిని మీరు అర్థం చేసుకుని, నిర్ధారిస్తారు:

  1. ఆధార్-PAN ధృవీకరణను పూర్తి చేయడానికి అవసరమైన వివరాలతో సహా, వాటికే పరిమితం కాకుండా, మీ దరఖాస్తుకు సంబంధించి PhonePeకు అవసరమైన రూపంలో, పద్ధతిలో మీరు ఏదైనా/అన్ని డాక్యుమెంట్‌లను షేర్ చేస్తారు/సమర్పిస్తారు. మీరు రిజిస్టర్ చేసిన ఆధార్/PAN‌ వివరాలలో ఏవైనా మార్పులు జరిగినట్లయితే, మీరు వెంటనే ఆ మార్పులను PhonePeకు అప్‌డేట్ చేస్తారు.
  2. మీరు మీ సమ్మతిని స్వచ్ఛందంగా, సొంత అభీష్టానుసారం అందిస్తున్నారని, అలానే UIDAI మార్గదర్శకాల ప్రకారం లేదా ఏదైనా వర్తించే చట్టం ప్రకారం, కాలానుగుణంగా దానిలో చేసిన సవరణల మేరకు, మీ గుర్తింపును నిరూపించేందుకు, దీని కోసం మీ గుర్తింపును ఆథంటికేట్ చేసే ఉద్దేశంతో  PhonePe, UIDAIకి మీ ఆధార్ సమాచారాన్ని షేర్ చేయాలనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారని మీరు ధృవీకరిస్తున్నారు.
  3. PhonePe నుండి PhonePe వాలెట్ సేవలను పొందేందుకు వర్తించే చట్టం ప్రకారం అనుమతించిన KYC డాక్యుమెంటేషన్, ఆధార్-PAN ధృ, మోసాల నివారణకు డ్యూ డిలిజెన్స్ కోసం మీ ఆధార్ వివరాలను ఉపయోగిస్తారు.
  4. మీరు ఆధార్-PAN ధృవీకరణ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి, అలానే UIDAI ఆధార్ ఆథంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టాలి.
  5. ఆధార్ ఆథంటికేషన్ ప్రక్రియ రికార్డులను సాక్ష్యాలుగా PhonePe ఉపయోగించవచ్చని,   నియంత్రణా సంస్థల విభాగాలు/న్యాయ లేదా పాక్షిక-న్యాయ సంస్థలు/ఆడిటర్లు/మధ్యవర్తులు లేదా ఆర్బిట్రేటర్‌లకు సమర్పించవచ్చని మీరు అర్థం చేసుకుని, ధృవీకరిస్తున్నారు.
  6. ఏదైనా KYC డాక్యుమెంట్ లేదా UIDAI / దాని అధీకృత ఏజెన్సీల నుంచి PhonePe పొందిన వివరాలతో సహా, మీరు అందించిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నాయని లేదా మ్యాచ్ కావట్లేదని గమనించినట్లయితే, PhonePe మీకు సేవలను అందించడానికి లేదా సేవలను కొనసాగించడానికి బాధ్యత వహించదు, అలానే మీ దరఖాస్తును తిరస్కరించవచ్చు / మీ అకౌంట్/ సేవలను తన సొంత విచక్షణాధికారం మేరకు నిలిపివేయాలని నిర్ణయించుకోవచ్చు.
  7. ఏదైనా కారణాల వల్ల మీ ఆధార్-PAN ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయలేకపోతే, PhonePe ఏ విధంగానూ దానికి బాధ్యత వహించదు, ఈ విషయంలో మీరు PhonePeను ఆశ్రయించకుండానే మీ సొంత ఖర్చుతో ఆధార్-PAN ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. PhonePe సంతృప్తి చెందిన మేరకు మీ ఆధార్-PAN ధృవీకరణ ప్రక్రియ పూర్తయితే తప్ప మీకు PhonePe వాలెట్ సేవలను అందించడానికి PhonePe బాధ్యత వహించదు.
  8. ఏవైనా కారణాల వల్ల (ఆధార్-పాన్ ధృవీకరణ ప్రక్రియను చేపట్టేటప్పుడు టెక్నికల్, సిస్టమాటిక్ లేదా సర్వర్ ఎర్రర్‌లు/సమస్యలు లేదా ఏదైనా ఇతర సమస్య సంభవించినప్పుడు, వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఇంకేవైనా సమస్యలు తలెత్తినప్పుడు) మీకు ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా నాశనమైనా, మీరు గానీ లేదా మీ తరపున ఎవరైనా అటువంటి సలహా ఇచ్చినప్పటికీ PhonePe ఎటువంటి బాధ్యత తీసుకోదు లేదా నష్టం జరగదని ఎలాంటి హామీని ఇవ్వదు.
  9. ఈ ఆధార్-PAN ధృవీకరణ ఆథంటికేషన్ ప్రక్రియ కోసం UIDAI నుండి అలానే మీ నుండి లేదా మీ తరపున మేము స్వీకరించే మీకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారం, విషయాలు అన్ని విధాలుగా వాస్తవమైన, సరైన, తాజా సమాచారాన్ని ప్రతిబింబించాలి. ఆధార్ ఆథంటికేషన్‌ను నిర్వహించేందుకు PhonePe / UIDAI / దాని అధీకృత ఏజెన్సీలకు అవసరమైన ఏదైనా మెటీరియల్ సమాచారాన్ని మీరు దాచివేయలేదు.
  10. PhonePe, తన సొంత విచక్షణ మేరకు, మీ దరఖాస్తును యాక్సెప్ట్ చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు / ఎలాంటి కారణాలను తెలపకుండానే ఆధార్-PAN ధృవీకరణ పూర్తి చేయాలని మిమ్మల్ని కోరవచ్చు, ఈ విషయంపై మీరు వివాదాన్ని లేవనెత్తకూడదు.
  11. KYC ప్రాసెస్‌లో భాగంగా మీ KYC డాక్యుమెంట్‌లు, అలానే సమాచారాన్ని అందించినంత మాత్రాన, ఫుల్ KYC వాలెట్‌ను పొందేందుకు మీకు అర్హత ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు అందించిన డేటాను ఫుల్ KYC వాలెట్‌ను జారీ చేసే ముందు, KYC మార్గదర్శకాలు, PhonePe విధానాల ప్రకారం ధృవీకరించి, సమీక్షిస్తాము. పైన పేర్కొన్న విధంగా KYC ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ కేటగిరీ కింద PhonePe వాలెట్‌ జారీ అవుతుంది.
  12. మీ ఫుల్ KYC వాలెట్‌ను రీలోడ్ చేసుకోవచ్చు, అలానే దీన్ని ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేస్తారు. ఎప్పటికప్పుడు నియంత్రణ సంస్థ అనుమతించిన మేరకు, ఇంకా PhonePe అంతర్గత విధానాల ప్రకారం మీ బ్యాంక్ ఖాతా మరియు / లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి లోడ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.
  13. నియంత్రణ సంస్థ అనుమతించిన పరిమితులు మేరకు లేదా మా అంతర్గత రిస్క్ పాలసీల ఆధారంగా వర్తించే ఏవైనా పరిమితుల మేరకు ఫుల్ KYC వాలెట్‌లోకి మీరు డబ్బును లోడ్ చేయగలుగుతారు. అయితే మీ ఫుల్ KYC వాలెట్‌లో ఉన్న నగదు బ్యాలెన్స్ ఏ సమయంలోనైనా INR 2,00,000/- (రూ. రెండు లక్షలు) మించకూడదు. మీరు UPI, లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా PhonePe అప్లికేషన్ లేదా మర్చెంట్‌ ప్లాట్‌ఫామ్‌లలో మీ లావాదేవీలను రద్దు చేయడం, రిటర్న్‌ల కారణంగా వచ్చే రీఫండ్‌ల రూపంలో ఫుల్ KYC వాలెట్‌లోకి డబ్బును లోడ్ చేయవచ్చు.
  14. ఏదైనా మర్చెంట్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ప్రోడక్ట్‌లు, సేవలను కొనుగోలు చేయడానికి ఫుల్ KYC వాలెట్ ఉపయోగించవచ్చు. పేమెంట్ సమయంలో పేమెంట్ పద్ధతిగా ఫుల్ KYC వాలెట్‌ను ఎంచుకోవడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. PhonePe ప్రస్తుతం ఫుల్ KYC వాలెట్‌ల మధ్య డబ్బు బదిలీని అనుమతించట్లేదు.
  15. మర్చెంట్ / మర్చెంట్ ప్లాట్‌ఫామ్‌కు పేమెంట్ చేసేటప్పుడు మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ పద్ధతులలో ఫుల్ KYC వాలెట్ ఒకటి. ఫుల్ KYC వాలెట్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన ప్రోడక్ట్‌లకు మేము ఎటువంటి బాధ్యత వహించము, ఆ విషయంలో ఎలాంటి బాధ్యతనూ తీసుకోబోమని స్పష్టంగా తెలియచేస్తున్నాము. అయితే, ఈ కింద పేర్కొన్న సందర్భాలలో యూజర్ అతని/ఆమె PhonePe అకౌంట్‌తో లింక్ అయిన బ్యాంక్ నుండి  నేరుగా చెల్లించవచ్చు:
    • ఆర్డర్ విలువ ఫుల్ KYC వాలెట్‌లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ అయినప్పుడు; లేదా
    • పూర్తి KYC వాలెట్‌ ఉపయోగించి యూజర్ చేసే కొనుగోళ్లపై అతని/ఆమెకు ఉన్న పరిమితిని దాటిపోయినప్పుడు.
  16. మీ పూర్తి KYC వాలెట్‌ను లాగిన్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి మీ P-SSOను మీరు ఉపయోగించాలి. మీ PhonePe అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి మీ నుంచి అదనపు భద్రతా చర్యలను కోరవచ్చు/ మీకు అందించవచ్చు.
  17. PhonePe కూడా మీ ఫుల్ KYC వాలెట్‌లో నిర్వహించాలనుకునే లావాదేవీలపై పరిమితిని సెట్ చేయడానికి మీకు ఓ ఆప్షన్‌ను ఇస్తుంది, మీరు ఏ సమయంలోనైనా అదనపు కారకంతో ఆథరైజ్ చేసి దాన్ని మార్చవచ్చు.
  18. మీరు PhonePe అకౌంట్ / ఫుల్ KYC వాలెట్‌లో సమర్పించిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, వాటికి PhonePe బాధ్యత వహించదు, కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్‌లను అప్‌డేట్ చేసేటప్పుడు, లబ్ధిదారులను యాడ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  19. ఇక్కడ పేర్కొన్న ఫీచర్‌లు, లిమిట్‌లు PhonePe అంతర్గత రిస్క్ అసెస్‌మెంట్‌కు లోబడి ఉంటాయి, అలానే మేము లోడ్‌, ఖర్చు పరిమితులను తగ్గించవచ్చు, నిధులను లోడ్ చేసిన వెంటనే మీ ఫుల్ KYC వాలెట్‌లో కూలింగ్ పీరియడ్‌ను వర్తింపచేయవచ్చు, అలానే నిర్దిష్ట మర్చెంట్‌ల వద్ద ఖర్చు చేయడంపై పరిమితులు విధించవచ్చు, మీ పూర్తి KYC వాలెట్‌ను యాక్సెస్ చేయడంపై పరిమితులు విధించవచ్చు లేదా మీ అకౌంట్‌ను LEAలు లేదా ఇతర నియంత్రణదారులకు నివేదించవచ్చు. పైన పేర్కొన్న చర్యను తీసుకునేటప్పుడు మేము మీకు తెలియచేయవచ్చు లేదా తెలియచేయకపోవచ్చు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇది మా వినియోగదారులు, మర్చంట్ల కోసం మీ PhonePe వాలెట్లను, ఎకోసిస్టమ్‌ను సురక్షితంగా ఉంచేందుకు మేము నిర్వహించే ట్రాన్సాక్షనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్‌లో ఒక భాగం.
  20. మీ PhonePe యాప్‌లో అభ్యర్థనను పంపించి కానీ లేదా PhonePe నిర్దేశించిన ఏదైనా ఇతర ప్రక్రియ ప్రకారం మీ పూర్తి KYC వాలెట్‌ను ఎప్పుడైనా మూసివేయవచ్చు. మూసివేసే సమయంలో అందులో ఉన్న బ్యాలెన్స్ మీరు సమర్పించిన మీ బ్యాంక్ అకౌంట్‌కు మరియు/లేదా ‘బ్యాక్ టు సోర్స్’ (పూర్తి KYC వాలెట్‌లోకి నగదు లోడ్ చేయడానికి ఉపయోగించిన పేమెంట్ సోర్స్)కు బదిలీ చేస్తారు. ఫుల్ KYC వాలెట్‌ను మూసివేసిన తర్వాత అందులోని నిధులను బదిలీ చేయాల్సిన మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన సంబంధిత సమాచారం/పత్రాలు మరియు/లేదా ‘బ్యాక్ టు పేమెంట్ సోర్స్’ ఇన్‌స్ట్రుమెంట్‌కి సంబంధించిన సంబంధిత సమాచారం/పత్రాల కోసం కాల్ చేయడానికి PhonePeకు అర్హత ఉంటుందని మీరు ఈ సందర్భంగా అంగీకరిస్తున్నారు, అలానే అర్థం చేసుకున్నారు.
  21. పూర్తి KYC వాలెట్‌లోని మీ నిధులను ‘బ్యాక్ సోర్స్ ఖాతా’ (PPI లోడ్ చేయడానికి ఉపయోగించిన పేమెంట్ సోర్స్) లేదా PhonePe ధృవీకరించిన మీ సొంత బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయవచ్చు.
  22. మీ జియోలొకేషన్‌తో పాటు మొత్తం VKYC ప్రక్రియకు సంబంధించిన వీడియో, ఆడియోను రికార్డ్ చేయడానికి PhonePeకు మీరు సమ్మతిని తెలియచేశారు.
  23. వీడియో కాల్‌కు మీరు తప్పకుండా హాజరు కావాలి. PhonePe ప్రతినిధితో జరిగే వీడియో కాల్‌లో మీకు కొన్ని తప్పనిసరిగా సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలను అడుగుతారు, వాటికి మీరు నిజాయితీగా, సరైన పద్ధతిలో సమాధానం ఇవ్వాలి.
  24. మీరు వీడియో కాల్ మాట్లాడే చోట బ్యాక్‌గ్రౌండ్‌లో తక్కువ శబ్దం/అసలు అంతరాయాలు లేని మంచి లైటింగ్ వాతావరణం ఉండేలా చూసుకోవాలి. PhonePe తన సొంత విచక్షణ మేరకు వీడియో కాల్ స్పష్టంగా లేదని, మోసపూరితంగా ఉందని, అస్పష్టంగా ఉందని మరియు/లేదా ఏవైనా కారణాల వల్ల వీడియో కాల్‌తో సంతృప్తి చెందలేదని భావిస్తే VKYCని తిరస్కరించవచ్చు.
  25. PhonePe తన సొంత విచక్షణ మేరకు అదనపు సమాచారం/డాక్యుమెంట్‌లు మరియు/లేదా మరొక వీడియో కాల్‌కు హాజరు కావాలని కోరవచ్చు.
  26. మీరు పాల్గొన్న ధృవీకరణ ప్రక్రియతో పాటు ఇచ్చిన సమాచారానికి లోబడి, PhonePe తన విచక్షణ మేరకు KYC డాక్యుమెంట్‌లు మరియు/లేదా VKYCని యాక్సెప్ట్ చేయవచ్చు / తిరస్కరించవచ్చు.

సెంట్రల్ KYC (CKYC): వర్తించే RBI మార్గదర్శకాలు, ఇతర వర్తించే చట్టాలను అనుసరించి, మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో లావాదేవీ చేసినప్పుడు/KYC పూర్తి చేసినప్పుడు PhonePe మీ KYC రికార్డులను CERSAI (సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా)కు సమర్పించాలి. అలానే ధృవీకరణ కోసం CERSAI వద్దనున్న మీ ప్రస్తుత KYC రికార్డులను కూడా PhonePe తిరిగి పొందుతుంది. మీరు CKYC వద్ద రిజిస్టర్ చేసుకోనట్లయితే, మీ KYC ధృవీకరణ ప్రక్రియ సమయంలో PhonePeకు మీరు అందించిన KYC వివరాలను PhonePe సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా, CERSAI వద్ద ఉన్న రికార్డులతో పోల్చినప్పుడు మీరు PhonePeకి అందించిన KYC వివరాలు అప్‌డేట్‌గా ఉన్నాయని నిర్ధారిస్తే, ఆ వివరాలతో CERSAI వద్ద ఉన్న మీ ప్రస్తుత వివరాలను అప్‌డేట్ చేస్తారు.

స్టేటస్: మీ ఫుల్ KYC స్టేటస్ తనిఖీ చేయడం కోసం, PhonePe ప్లాట్‌ఫామ్/అప్లికేషన్‌కు లాగిన్ అవ్వండి, అలానే మీ VKYC ఆమోదం పొందినట్లయితే, అది PhonePe వాలెట్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లుగా చూపుతుంది.

ఛార్జీలు: ఏదైనా KYCని పూర్తి చేయడం కోసం PhonePe యూజర్‌ల నుంచి ఛార్జీలను వసూలు చేయదు.

పూర్తి KYC వాలెట్ నాన్ ఫేస్-టు-ఫేస్ ఆధార్ OTP ఆధారిత (పూర్తి KYC- నాన్ F2F వాలెట్)

మీకు జారీ చేసిన ఫుల్ KYC- నాన్ F2F వాలెట్ వినియోగం అనేది ఈ కిందన పేర్కొన్న నియమాలపై ఆధారపడి ఉంటుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:

  1. మీరు ఆధార్ OTP ఆధారిత e-KYCని ఉపయోగించి ఫుల్ KYC- నాన్ F2F వాలెట్‌ను ఓపెన్ చేయడం కోసం OTPతో ఆథంటికేట్ చేయడానికి సమ్మతిని తెలిపారు.
  2. మీరు లేదా మీ తరపున ఇంకెవరైనా OTP ఆధారిత eKYCని ఉపయోగించి మరే ఇతర అకౌంట్‌ను ఓపెన్ చేయలేదని లేదా ఓపెన్ చేయరని మీరు ధృవీకరిస్తున్నారు.
  3. ఒకవేళ మీకు మరో అకౌంట్‌ ఉన్నట్లయితే లేదా భవిష్యత్తులో ఏదైనా ఇతర OTP-ఆధారిత eKYC అకౌంట్‌ను ఓపెన్ చేసినట్లయితే, PhonePe మీకు కల్పించిన పూర్తి KYC- నాన్ F2F వాలెట్‌లో ఆ తర్వాత నుంచి చేయాలనుకున్న ఏవైనా టాప్-అప్‌లను PhonePe నిషేధించవచ్చు.
  4. KYC మార్గదర్శకాల ప్రకారంగా, eKYC ఆధారిత ఖాతాదారు, eKYC ఆధారిత అకౌంట్‌ను ప్రారంభించిన 1 సంవత్సరంలోపు కస్టమర్ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలి. పూర్తి KYC- నాన్ F2F వాలెట్‌ను జారీ చేసిన 1 సంవత్సరంలోపు PhonePe ద్వారా మీకు VCIP ఆప్షన్‌ను ఇవ్వవచ్చు. మీరు VCIP ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే, PhonePe తగిన చర్యలు తీసుకుంటుంది, ఇంకా మీ PPI వాలెట్‌లో ఆ తర్వాత చేయబోయే ఎలాంటి టాప్ అప్‌లను అనుమతించకపోవచ్చు. నియంత్రణ అవసరాలకు లోబడి, డెబిట్ లావాదేవీల కోసం మాత్రమే ఫుల్ KYC- నాన్ F2F వాలెట్‌లో మీ ప్రస్తుత బ్యాలెన్స్‌ను వినియోగించుకోవడానికి మీకు అనుమతి ఉంటుంది.
  5. KYC మార్గదర్శకాల ప్రకారంగా, eKYC ఆథంటికేషన్‌తో ఓపెన్ అయిన అన్ని డిపాజిట్ అకౌంట్‌లలోని మొత్తం బ్యాలెన్స్ రూ. 1,00,000 (రూ. లక్ష మాత్రమే)కు మించకూడదు. అదేవిధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపాజిట్ అకౌంట్‌ల నుంచి తీసుకున్న రుణాలు అన్నీ కలిపితే వచ్చిన మొత్తం రూ. 2,00,000/- (రూ. రెండు లక్షలు మాత్రమే)కు మించకూడదు. ఒకవేళ, గరిష్ఠ పరిమితిని మించి బ్యాలెన్స్ ఉంటే, ప్రస్తుత నిబంధనల ప్రకారం కస్టమర్ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ లేదా VCIP ప్రక్రియ పూర్తయినప్పుడు మినహాయించి, ఫుల్ KYC- నాన్ F2F వాలెట్ పనిచేయడం ఆగిపోతుంది.

పైన పేర్కొన్న e-KYC ఆథంటికేషన్ ప్రక్రియ కాలానుగుణంగా సవరించిన KYC మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని దయచేసి గమనించండి. PhonePe వినియోగ నియమాలపై ఏవైనా అదనపు వివరాలు కావాలన్నా లేదా ఏవైనా సందేహాలు ఉన్నా, మీరు https://support.phonepe.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

గిఫ్ట్ PPI

  • రీలోడ్ చేయలేని గిఫ్ట్ ఇన్‌స్ట్రుమెంట్ (“eGV”)
    ఈ కేటగిరీ కింద PhonePe జారీ చేసిన eGVలను ఇక్కడ పేర్కొన్న ఫీచర్‌లు, పరిమితులు ఉన్న MD-PPIs, 2021లోని పేరా 10.1 ద్వారా నిర్వహిస్తారు. PhonePe యూజర్‌గా, మీ PhonePe అకౌంట్‌ను ఉపయోగించి eGVలను కొనుగోలు చేయవచ్చు/గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. అలానే, మా విచక్షణ మేరకు, మేము కూడా మీకు eGVలను గిఫ్ట్‌గా ఇస్తాము.
  1. కొనుగోలు: eGVలు రూ. 10,000/- వరకు డినామినేషన్‌లలో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. మా అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రకారంగా గరిష్ఠ eGV మొత్తంపై PhonePe పరిమితం విధించవచ్చు. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా RBI అనుమతించిన, అలానే PhonePe అందించిన, సపోర్ట్ చేస్తున్న ఏదైనా ఇతర ఇన్‌స్ట్రుమెంట్‌ను ఉపయోగించి eGVని కొనుగోలు చేయవచ్చు. PhonePe వాలెట్ (ఫుల్ KYC వాలెట్‌తో సహా) లేదా మరొక eGV బ్యాలెన్స్‌ను ఉపయోగించి eGVలను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. సాధారణంగా eGVలు తక్షణమే డెలివరీ చేస్తాము. కానీ కొన్నిసార్లు సిస్టమ్ సమస్యల కారణంగా, డెలివరీ 24 గంటల వరకు ఆలస్యం కావచ్చు. ఈ కాలపరిమితిలోపు eGV డెలివరీ కానట్లయితే, వెంటనే ఆ సమస్యను మాకు తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. దీని వల్ల మేము వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుంది. మా అంతర్గత విధానాల మేరకు eGVలను కొనుగోలు పరిమితితో లేదా కనీస కొనుగోలు విలువతో అందించవచ్చు.
  2. పరిమితి: ఉపయోగించని eGV బ్యాలెన్స్‌లతో పాటు eGVల గడువు పరిమితి, అవి జారీ అయిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు ముగుస్తుంది. eGVలను రీలోడ్ చేయడానికి, తిరిగి విక్రయించడానికి, ఏదైనా విలువ మొత్తానికి బదిలీ చేయడానికి లేదా నగదు కోసం రీడీమ్ చేయడానికి వీలు పడదు. మీ PhonePe అకౌంట్‌లో ఉపయోగించని eGV బ్యాలెన్స్‌లు మరొక PhonePe ఖాతాకు బదిలీ చేయలేకపోవచ్చు, కానీ మీరు కొనుగోలు చేసిన eGVల వివరాలు కలిగి ఉన్న లేదా అలాంటి eGVని మీరు బహుమతిగా ఎవరికి ఇచ్చారో ఆ వ్యక్తి ద్వారా క్లెయిమ్ చేయవచ్చు. ఏదైనా eGV లేదా eGV బ్యాలెన్స్‌పై PhonePe వడ్డీ చెల్లించదు.
  3. రిడీమ్ చేసుకోవడం: PhonePe ప్లాట్‌ఫామ్‌లో అర్హత కలిగిన మర్చెంట్‌లతో లావాదేవీలు చేయడం కోసం మాత్రమే eGVని రీడీమ్ చేయవచ్చు. యూజర్ eGV బ్యాలెన్స్ నుండి కొనుగోలు మొత్తాన్ని తీసివేస్తాము. ఏదైనా ఉపయోగించని eGV బ్యాలెన్స్ యూజర్ PhonePe అకౌంట్‌తో అనుసంధానమై ఉంటుంది, ఇంకా మొత్తం బ్యాలెన్స్‌లో మల్టిపుల్ eGVల బ్యాలెన్స్‌లు ఉన్నట్లయితే, ముందుగా గడువు ముగియనున్న eGV బ్యాలెన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు అప్లై చేస్తుంది. యూజర్ కొనుగోలు చేసిన విలువ కంటే eGV బ్యాలెన్స్‌ తక్కువగా ఉన్నట్లయితే, మిగిలిన మొత్తాన్ని అందుబాటులో ఉన్న ఇతర పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌లతో చెల్లించాలి.
  4. అలానే eGV కొనుగోలుదారు/రిడీమర్ KYC వివరాలను మరియు/లేదా eGV కొనుగోలుకు సంబంధించి ఏదైనా ఇతర సమాచారాన్ని మరియు /లేదా eGVని ఉపయోగించి PhonePe అకౌంట్‌లో చేసిన లావాదేవీ లేదా అనుబంధ లావాదేవీలను RBI లేదా అటువంటి చట్టబద్ధమైన అధికారులకు PhonePe షేర్ చేయాల్సి ఉంటుంది. అటువంటి సమాచారం కోసం మేము మీతో సహా eGV యొక్క కొనుగోలుదారు/రిడీమర్‌ను కూడా సంప్రదించవచ్చు అని అని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు.
  5. eGVలు మీకు జారీ అవుతాయి, అయితే దాన్ని PhonePeలో రీడీమ్ చేసుకునేందుకు వీలుగా మీకు నచ్చినవారికి వాటిని షేర్ చేయవచ్చు. eGV పోయినా, ఎవరైనా దొంగిలించినా, నాశనం చేసినా లేదా అనుమతి లేకుండా ఉపయోగించినా దానికి PhonePe బాధ్యత వహించదు. మోసపూరితంగా పొందిన eGVని PhonePe ప్లాట్‌ఫామ్‌లో కొనుగోళ్లు చేయడానికి ఉపయోగించిన మరియు/లేదా రీడీమ్ చేసిన, మోసాలకు పాల్పడిన కస్టమర్ల అకౌంట్‌లను మూసివేయడానికి, ఆ పేమెంట్‌ను ప్రత్యామ్నాయ పేమెంట్ రూపాలలో వసూలు చేసుకునే హక్కు PhonePeకు ఉంటుంది. PhonePe ప్లాట్‌ఫామ్‌లో eGVల కొనుగోళ్లు, రీడీమ్‌లు రెండింటినీ PhonePe రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కవర్ చేస్తుంది. మా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (మోసాలను నిరోధించే నియమాలు/పద్ధతులతో సహా) ప్రకారం, అనుమానాస్పదంగా భావించే లావాదేవీలను PhonePe అనుమతించకపోవచ్చు. మోసపూరితంగా పొందిన / కొనుగోలు చేసిన eGVలను రద్దు చేసే హక్కు PhonePeకు ఉంది. అలానే మా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్‌లపై పరిమితులను విధిస్తుంది.
  6. PhonePe రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా eGVలను మీకు ప్రోత్సాహకంగా లేదా రివార్డ్‌ రూపంలో కూడా జారీ చేయవచ్చు. అలానే eGV రూపంలో మీకు అలాంటి రివార్డ్‌లను అందించే పూర్తి హక్కు, విచక్షణాధికారం మాకు ఉంది.
  • పరిమితి, గడువు పరిమితులు
    • eGVలు 1 సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతాయి, ఇంకా ఒక్కో eGV విలువ గరిష్ఠ పరిమితి రూ.10,000 ఉంటుంది. PhonePe తన సొంత అభీష్టానుసారం మీ eGVల చెల్లుబాటు వ్యవధిని పొడిగించే హక్కును కలిగి ఉంది.
    • మొత్తంగా వర్తించే పరిమితి లోపలే అదనపు మొత్తం(అమౌంట్) పరిమితులను విధించే హక్కు PhonePeకు ఉంది.
    • PhonePe ఎప్పటికప్పుడు నిర్ణయించే అంతర్గత విధానం ప్రకారం ఆఫర్‌లు, సంబంధిత ప్రయోజనాలను అందించే హక్కు PhonePeకు ఉంది.
    • ఏదైనా కారణం చేత లావాదేవీని రద్దు చేసినట్లయితే, లావాదేవీపై ఇచ్చిన క్యాష్‌బ్యాక్ eGV రూపంలోనే ఉంటుంది, ఇంకా దాన్ని మీ బ్యాంక్ ఖాతాకు విత్‌డ్రా చేయలేరు. కాకపోతే దీన్ని PhonePe ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించుకోవచ్చు.
    • రీఫండ్ చేసిన అమౌంట్‌ నుంచి క్యాష్‌బ్యాక్‌ను తీసివేయగా మిగిలిన మొత్తాన్ని పేమెంట్ చేసేటప్పుడు ఉపయోగించిన నిధుల సోర్సుకు తిరిగి క్రెడిట్ అవుతుంది.
    • PhonePe యాప్‌లో అనుమతించిన లావాదేవీలకు, ఇంకా PhonePe భాగస్వామి ప్లాట్‌ఫామ్‌లు/స్టోర్‌లలో చెల్లింపులు చేయడానికి క్యాష్‌బ్యాక్ eGVలను ఉపయోగించవచ్చు.
    • క్యాష్‌బ్యాక్ eGVని ఏదైనా లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌లోకి విత్‌డ్రా చేయడం లేదా ఇతర కస్టమర్‌లకు బదిలీ చేయడం సాధ్యం కాదు.
    • PhonePeలో అందించిన అన్ని ఆఫర్‌ల ద్వారా మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో (అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) గరిష్టంగా INR 9,999 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

సాధారణ నియమ, నిబంధనలు

  • మీ లాగిన్ క్రెడెన్షియల్స్ పూర్తిగా మీ వ్యక్తిగతమైనవి, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ సురక్షితంగా, భద్రంగా ఉన్నాయని మీరు నిర్ధారించుకోవాలి. మీ PhonePe వాలెట్, eGV భద్రతకు మీరే బాధ్యత వహించాలి, అలానే మీ PhonePe అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే పరికరాలతో సహా అన్ని వివరాలను సురక్షితంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. అలానే మీ అకౌంట్‌ను యాక్సెస్ చేసేందుకు ఉపయోగించే క్రెడెన్షియల్‌ను  ఎవరైనా వ్యక్తికి ప్రత్యక్షంగా చెప్పడం, రాసి ఇవ్వడం లేదా మరేదైనా రూపంలో రికార్డ్ చేయడం సహా ఏ రూపంలో అయినా బయటకు వెల్లడించకూడదు. ఒకవేళ మీరు పొరపాటున లేదా నిర్లక్ష్యం కారణంగా ఆ వివరాలను బయటకు తెలియచేసినట్లయితే, మీరు వెంటనే ఆ యాక్టివిటీని PhonePeకు తెలియచేయాలి. అయితే, మీ సురక్షిత అకౌంట్ యాక్సెస్ క్రెడెన్షియల్స్‌తో ఏదైనా థర్డ్ పార్టీ చేసే అనధికార లావాదేవీకి PhonePe బాధ్యత వహించదు.
  • హై-రిస్క్/మోసపూరిత లావాదేవీలు జరిగేందుకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు మీ లావాదేవీ(ల)ను మేము పర్యవేక్షించవచ్చు. మా నిరంతర లావాదేవీ పర్యవేక్షణను బట్టి, లావాదేవీ(ల)ను మేము నిలిపివేయవచ్చు, అటువంటి లావాదేవీ(ల)ను బ్లాక్ చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు. దీనితో పాటు, మీ PhonePe Wallet లేదా eGV లేదా అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు, అలానే మీ అకౌంట్/లావాదేవీని విడుదల చేయడం / పునరుద్ధరించడం కోసం మీ గురించి, మీకు నిధులు వచ్చిన సోర్సుకు సంబంధించిన మరింత సమాచారం గురించి మిమ్మల్ని అడగవచ్చు. ఎవరైనా ఉద్యోగిని, కంపెనీని దుర్భాషలాడినా లేదా మీరు తప్పుగా డిక్లరేషన్ చేసినా మీ అకౌంట్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బ్లాక్ చేయవచ్చు, అలానే మీ అకౌంట్‌ను మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దీని వలన మీకు కలిగే నష్టానికి మేము బాధ్యత వహించము.
  • PhonePe దాని అంతర్గత విధానాలు, నియంత్రణ, చట్టబద్ధమైన మార్గదర్శకాల ఆధారంగా ఏవైనా లావాదేవీలను అనుమానాస్పదమైనవని లేదా మోసపూరితమైనవని గుర్తించినట్లయితే, సంబంధిత అధికారులకు ఆ లావాదేవీలను తెలియచేయవచ్చని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు. అయితే ఇలా చేయడం వల్ల మీకు ఏదైనా నష్టం జరిగినట్లయితే, తర్వాతి దశల్లో అటువంటి లావాదేవీ సాధారణమైనదని, చట్టబద్ధమైనదని తేలినప్పటికీ, మేము దానికి బాధ్యత వహించము.
  • ఏదైనా లావాదేవీని చేస్తున్నప్పుడు, మీ PhonePe వాలెట్ / eGV లేదా ఇతర నిధుల సోర్సులలో ఉపయోగించే ఇతర నిధుల వనరులలో తగినన్ని నిధులు ఉన్నాయో లేదో అని మీరు నిర్ధారించుకోవాలి.
  • PhonePe అప్లికేషన్‌లో PhonePe అందించే సేవలు మీ లావాదేవీలను విజయవంతంగా పూర్తి చేయడానికి PhonePe అప్లికేషన్‌తో పాటు సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఉపయోగిస్తారని మీరు అర్థం చేసుకున్నారు, దీని వల్ల ఏదైనా నష్టం లేదా అంతరాయం కలిగినా, అంటే మొబైల్ లేదా ఇంటర్నెట్ సపోర్ట్ చేయకపోవడం, మర్చెంట్ వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లు సరిగ్గా స్పందించకపోవడం కారణంగా PhonePe వాలెట్ సేవలు లభించకపోవడం లేదా PhonePe వాలెట్ సేవలు మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఏదైనా నష్టం జరిగితే, దానికి మేము బాధ్యులం కాదని స్పష్టంగా తెలియచేస్తున్నాము..
  • PhonePe వాలెట్ సేవలను పొందడం కోసం మీరు షేర్ చేసిన సమాచారం, ఆ సేవలను అందించడానికి వీలుగా థర్డ్ పార్టీలకు షేర్ చేయవచ్చని మీరు అర్థం చేసుకున్నారు, అలానే అటువంటి సందర్భంలో, సర్వీస్ ప్రొవైడర్ల డేటా విధానాలు కూడా అటువంటి లావాదేవీలకు వర్తిస్తాయి, అందుకే మీరు ఆ విధానాలు తెలుసుకుని అప్‌డేట్ అవ్వాలి, అలాంటి సందర్భంలో డేటా షేరింగ్, వినియోగంపై PhonePeకు ఎటువంటి నియంత్రణ ఉండదని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
  • అటువంటి లావాదేవీలకు మీ బ్యాంక్/ఆర్థిక సంస్థ రుసుము(లు) లేదా ఛార్జీ(ల)ను వసూలు చేయవచ్చు, ఇంకా PhonePe అటువంటి రుసుము(ల) ఛార్జీలను గుర్తించే లేదా తిరిగి చెల్లించే బాధ్యతను తీసుకోదు. అలానే అన్ని పరిస్థితుల్లోనూ మీరే వాటిని భరించాలి.
  • మీ PhonePe వాలెట్ లేదా eGVలోకి నిధులు లోడ్ చేయడం, PhonePe అప్లికేషన్ లేదా భాగస్వామ్య మర్చెంట్‌లు అందించే సేవల కోసం ఖర్చు చేయడం వంటి ప్రక్రియలు ఇంటర్నెట్ ద్వారా పూర్తవుతాయి. ఇందులో మీ బ్యాంక్, సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సేవలు, టెలికాం ఆపరేటర్ మొదలైనవి మాత్రమే కాకుండా, మల్టిపుల్ స్టేక్‌హోల్డర్‌లు భాగస్వామ్యం అవుతాయి. మల్టిపుల్ పాయింట్లలో విఫలమయ్యే అవకాశం కారణంగా నిర్ధారణలు, రసీదులు ఎల్లప్పుడూ సర్వీస్ డెలివరీని ప్రతిబింబించకపోవచ్చు. అటువంటి సందర్భాలలో, ఆయా ఇతర స్టేక్‌హోల్డర్లు ఎదుర్కొంటున్న అసమర్థత / ప్రక్రియ వైఫల్యాల కారణంగా సంభవించే ఏదైనా నష్టానికి PhonePe బాధ్యత వహించదు, అలానే అలాంటి సందర్భాలలో మీ నిధులను PhonePe క్రెడిట్ చేస్తుంది లేదా మీ నుండి నిధులను రికవరీ చేస్తుంది, ఇంకా మీ PhonePe వాలెట్ / eGVపై తగిన పరిమితులు/ఆదేశాలను వర్తింపజేస్తుంది లేదా తన సొంత విచక్షణ మేరకు, పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, చట్టం ద్వారా అనుమతించిన మేరకు చెల్లించాల్సిన మొత్తాన్ని వసూలు చేయడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
  • మీ PhonePe యాప్‌లో మీ PhonePe వాలెట్, eGV లావాదేవీని చూడవచ్చు, అంతేకాక కనీసం గత 6 (ఆరు) నెలల లావాదేవీలను సమీక్షించవచ్చు.
  • PhonePe వాలెట్‌లు, eGVలు ఏ కేటగిరీకి చెందినవి అయినప్పటికీ, సహజంగానే వాటిని బదిలీ చేయలేము. క్లెయిమ్ చేయని వాటికి మినహాయింపు ఉంటుంది. అలానే, మిగిలి ఉన్న PhonePe వాలెట్ బ్యాలెన్స్‌లపై వడ్డీ చెల్లించము..
  • మీ అకౌంట్ సురక్షితమైనది, అలానే మీ PhonePe వాలెట్ / eGVలో ప్రాసెస్ చేసిన ఏదైనా లావాదేవీని మీరు తప్పనిసరిగా ఆథరైజ్ చేయాలి లేదా RBI ప్రకటించిన డెబిట్ ఆదేశాలను మీరు ఆథరైజ్ చేసిన, PhonePe అనుమతించిన మేరకు మీ PhonePe వాలెట్‌లో  ప్రాసెస్ అవుతుంది.
  • మీరు ఎప్పటికప్పుడు PhonePe అనుమతించిన మల్టిపుల్ eGVలను కొనుగోలు చేయగలిగినప్పటికీ, వాలెట్ వినియోగ నియమాలకు సంబంధించి ఏదైనా ఉల్లంఘన జరిగినట్లుగా అనుమానం కలిగినట్లయితే, మీ PhonePe వాలెట్ / eGVలు లేదా PhonePe అకౌంట్‌ను మీరు యాక్సెస్ చేయకుండా నిలిపివేయడానికి కారణం కావొచ్చు.
  • పేమెంట్‌ చేసే సమయంలో ఆన్‌లైన్ మర్చెంట్‌ ప్లాట్‌ఫామ్‌లో కనిపించే PhonePe వాలెట్ బ్యాలెన్స్‌లో మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో క్యాష్‌బ్యాక్(లు)గా పొందిన eGV ఉంటుంది.
  • అయితే, PhonePe వాలెట్ నిరంతరాయంగా అందుబాటులో ఉండటం అనేది,  వర్తించే చట్టం, అలానే MD-PPIs, 2021 కింద ఉండాల్సిన అవసరాలకు లోబడి ఉంటుంది. ఈ కింద ప్రస్తావించిన కారణాలకే పరిమితం కాకుండా, ఏదైనా కారణంతో ఏ సమయంలో అయినా వాలెట్‌ను సస్పెండ్ చేసే/నిలిపివేసే హక్కు PhonePeకు ఉంది-
    • RBI ఎప్పటికప్పుడు జారీ చేసే నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, మార్గదర్శకాలు, నోటిఫికేషన్‌లను ఉల్లంఘించినందుకు లేదా ఏదైనా వాలెట్ వినియోగ నియమాలను ఉల్లంఘించినందుకు
    • మీ వివరాలు, KYC డాక్యుమెంటేషన్ లేదా మీరు అందించిన సమాచారంలో ఏవైనా తేడాలు ఉన్నట్లుగా అనుమానించినా; లేదా
    • జరిగేందుకు అవకాశం ఉన్న మోసం, విధ్వంసం, ఉద్దేశపూర్వక విధ్వంసం, జాతీయ భద్రతకు ముప్పు లేదా ఏదైనా ఇతర బలవంతపు సంఘటనలను ఎదుర్కోవడం కోసం; లేదా
    • ఏదైనా ఇతర చట్టబద్ధమైన ప్రయోజనం కోసం, మీ PhonePe వాలెట్‌ను, ఆపివేయడం/నిలిపివేయడం అవసరమని PhonePe తన సొంత అభిప్రాయం,  విచక్షణ మేరకు నమ్మినప్పుడు.
  • నియంత్రణ సంస్థ సమాచారం ఇచ్చిన కారణంగా లేదా చట్టం ప్రకారం స్పష్టం చేసిన ఏవైనా ఇతర పరిస్థితుల కారణంగా ఏదైనా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌ను ఏదైనా రూపంలో మూసివేసినప్పుడు లేదా ఆపివేసినప్పుడు, మీరు మీ PhonePe వాలెట్/eGVలో బకాయి ఉన్న బ్యాలెన్స్‌ను రీడీమ్ చేయవచ్చు లేదా ఏదైనా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ వద్ద మీ పేరుతో ఉన్న/మీరు నిర్వహిస్తున్న బ్యాంక్ అకౌంట్‌కు  బదిలీ చేయవచ్చు. కాకపోతే PhonePe నిర్ణయించిన సమయంలోనే బదిలీ చేయాలి. ఒకవేళ బదిలీ చేయలేకపోతే, మీ PhonePe వాలెట్ లేదా eGVలోని బ్యాలెన్స్‌ను, PhonePe చేసిన తగిన ఏర్పాట్లు మేరకు, RBI ద్వారా అనుమతి పొందిన ఆ తరహా ఎంటిటీ జారీ చేసిన మీకు చెందిన మరొక ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌కు బదిలీ చేస్తుంది.

రీఫండ్ మరియు రద్దు

  • మొబైల్/ DTH రీఛార్జ్, బిల్లు పేమెంట్ లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీరు ప్రాసెస్ చేసిన ఏదైనా ఇతర పేమెంట్ కోసం PhonePe వాలెట్/eGV ద్వారా చేసే అన్ని చెల్లింపులు లేదా మర్చెంట్ పార్ట్‌నర్‌లు PhonePe వాలెట్‌ను (eGVలతో సహా) పేమెంట్ ఎంపికగా అంగీకరించినప్పుడు చేసిన పేమెంట్‌లను తుది పేమెంట్‌లుగా భావిస్తాము. మీ లేదా మర్చెంట్ పార్ట్‌నర్‌ల తరఫున ఏదైనా తప్పిదం లేదా లోపం తలెత్తినా, దానికి PhonePe బాధ్యత వహించదు. ఒకసారి ప్రారంభమైన అలాంటి లావాదేవీలను రీఫండ్, రిటర్న్ లేదా రద్దు చేయలేము.
  • మీరు పేమెంట్ చేయకూడదన్న మర్చెంట్‌కు ఏదైనా తప్పిదం వల్ల పేమెంట్‌ను ప్రాసెస్ చేసినా లేదా అమౌంట్‌ను తప్పుగా పేమెంట్ చేసినా (ఉదాహరణకు చివర్లో టైపోగ్రాఫికల్ ఎర్రర్ జరిగినట్లయితే), మీరు పేమెంట్ చేసిన మర్చెంట్‌ను నేరుగా సంప్రదించి, ఆ అమౌంట్‌ను తిరిగి చెల్లించాలని కోరడం మాత్రమే మీకున్న ఏకైక మార్గం. PhonePe అటువంటి వివాదాలను పరిష్కరించడానికి బాధ్యత వహించదు లేదా మేము మీకు తిరిగి చెల్లించము లేదా మీరు తప్పుగా చేసిన చెల్లింపును రివర్స్ చేయలేము.
  • ఒకవేళ మీరు ఇంతకు ముందు ప్రాసెస్ చేసిన లావాదేవీకి సంబంధించి మాకు రీఫండ్ వచ్చినట్లయితే, PhonePe వాలెట్/eGVతో సహా, చెల్లించిన రూపంలోనే సోర్సుకు తిరిగి జమ చేస్తాము. అయితే, రీఫండ్ కోసం మీరు నిర్దిష్టమైన పద్ధతిని లేదా మార్గాన్ని ప్రస్తావించకపోతేనే పైన పేర్కొన్న పద్ధతిలో జమ చేస్తాము. 
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్ ద్వారా లోడ్ చేసిన ఏదైనా eGVని ఉపయోగించి పేమెంట్స్ చేశాక, దాన్ని రద్దు చేసిన సందర్భంలో, అది ఎంత అమౌంట్ ఉండేదో అంతే అమౌంట్ ఉన్న eGVగా ఉంటుంది, దాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు విత్‌డ్రా చేయలేరు. PhonePe ప్లాట్‌ఫామ్‌లో అర్హత ఉన్న లావాదేవీలకు దీనిని ఉపయోగించవచ్చు..
  • అంతేకాక, లావాదేవీని రద్దు చేసిన సందర్భంలో, మొత్తం అమౌంట్‌ నుంచి క్యాష్‌బ్యాక్‌ను (eGV రూపంలో క్రెడిట్ అయినది) తీసివేయగా మిగిలిన మొత్తం, పేమెంట్ చేసినప్పుడు ఉపయోగించిన నిధుల సోర్సుకు రీఫండ్ అవుతుంది.

ఫీజులు మరియు ఛార్జీలు

  • PhonePe వాలెట్ (ఫుల్ KYC వాలెట్‌తో సహా) లేదా PhonePe అకౌంట్ యూజర్‌లకు PhonePe జారీ చేసిన eGVలకు ఎటువంటి మెంబర్‌షిప్ ఫీజు చెల్లించక్కర్లేదు. PhonePe స్పష్టంగా తెలియచేసిన సందర్భంలో మినహా, అకౌంట్‌ను క్రియేట్ చేయడానికి లేదా PhonePe సేవలను ఉపయోగించడానికి మీ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు.
  • మీ PhonePe వాలెట్‌ ద్వారా నిర్దిష్ట బిల్లు పేమెంట్ లావాదేవీలు చేసేందుకు కన్వీనియన్స్ ఫీజును వసూలు చేయవచ్చు, ఇది INR 0.50 నుండి INR 100 వరకు ఉండవచ్చు. మీ లావాదేవీతో పాటుగానే ఆ ఛార్జీని యాడ్ చేయడానికి ముందుగానే మీకు తెలియచేస్తాము.
  • PhonePe యూజర్‌ల నుండి PhonePe వాలెట్ లోడింగ్ ఫీజు(లు)ను వసూలు చేయవచ్చు, ఇది మీరు ఎంపిక చేసే ఇన్‌స్ట్రుమెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలానే ఆ ఛార్జీల వివరాలు తమ PhonePe వాలెట్‌ లోడ్ చేస్తున్నప్పుడే యూజర్‌లకు కనిపిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఆధారిత లోడింగ్ కోసం వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు 1.5% – 3% + GST వరకు ఉంటుంది. మీరు లోడింగ్ పూర్తి చేయడానికి ముందు ఖచ్చితమైన ఛార్జీలు అప్లికేషన్‌లో చూపుతాయి.
  • PhonePeకు తన ఫీజు(ల) విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకునే హక్కు ఉంది. మా సొంత అభీష్టానుసారం కొత్త సర్వీసులను పరిచయం చేయవచ్చు, అలానే ఇప్పటికే అందిస్తున్న కొన్ని లేదా అన్ని సేవలను సవరించవచ్చు, అంతేకాక అందిస్తున్న కొత్త/ఇప్పటికే ఉన్న సేవలకు ఫీజులను ప్రవేశపెట్టవచ్చు లేదా ఇప్పటికే ఉన్న సర్వీసుల కోసం ఫీజులను సవరించవచ్చు/ప్రవేశపెట్టవచ్చు. ఫీజు(లు) విధానంలో మార్పులు చేసిన వెంటనే అవి ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తాయి, ఈ నియమాలు, షరతులను మార్పులు ద్వారా తెలియచేస్తాము.

ఆపరేషనల్ చెల్లుబాటు & జప్తు

  • మీ PhonePe వాలెట్ అనేది కాలానుగుణంగా RBI చేసిన, అలానే PhonePe అనుమతించిన నియంత్రణ ఆదేశాల ప్రకారం చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం మీ PhonePe వాలెట్ సరెండర్ చేసిన లేదా రద్దు చేసిన లేదా జప్తు చేసిన సందర్భాలలో మినహాయించి, మిగిలిన సందర్భాలలో చెల్లుబాటు అవుతుంది. అయితే, జారీ అయిన eGVలు (ఉపయోగించని eGV బ్యాలెన్స్‌లతో సహా) వాలెట్‌ను చివరిసారిగా లోడ్ చేసిన/రీలోడ్ చేసిన తేదీ నుండి కనీసం 12 (పన్నెండు) నెలల పాటు చెల్లుబాటు అవుతాయి, ఇంకా PhonePe తన విచక్షణ మేరకు  అటువంటి చెల్లుబాటు వ్యవధిని పొడిగించవచ్చు. PhonePe తన అభీష్టానుసారం లేదా మీరు ఈ నియమాలను ఉల్లంఘించిన కారణంగా లేదా RBI నుండి లేదా మరేదైనా LEA నుండి జారీ అయిన ఆదేశానుసారం వాలెట్‌ను రద్దుచేయవచ్చు.
  • RBI లేదా భారత ప్రభుత్వం లేదా ఏదైనా ఇతర సంబంధిత సంస్థ జారీ చేసిన ఒప్పందం లేదా ఏదైనా నిబంధన/విధానంలోని ఏవైనా నియమాలను ఉల్లంఘించినప్పుడు, మీ PhonePe వాలెట్‌ను రద్దు చేసే హక్కు PhonePeకు ఉందని మీరు గమనించాలి. అటువంటి సందర్భంలో, PhonePe వాలెట్‌లో ఉన్న ఏదైనా బ్యాలెన్స్‌ను PhonePe ప్లాట్‌ఫామ్‌తో లింక్ అయిన మీ బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ చేస్తుంది. అటువంటి సందర్భంలో, PhonePe మీ అకౌంట్, లావాదేవీ వివరాలను సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీకి లేదా నియంత్రణ సంస్థలకు లేదా చట్టంలో పేర్కొన్న ఏదైనా ఇతర ఏజెన్సీకి నివేదించవచ్చు, ఇంకా సంబంధిత సంస్థ క్లియరెన్స్ ఇచ్చే వరకు మీ PhonePe వాలెట్‌ను నిలిపివేయవచ్చు.
  • మీ PhonePe వాలెట్ / eGV గడువు, ఇక్కడ పేర్కొన్న కారణాల వల్ల ముగుస్తున్నట్లయితే, PhonePe మీకు ఆ సమాచారాన్ని ముందుగానే(సహేతుకమైన వ్యవధిలో) తెలియచేస్తుంది. అంటే, గడువు ముగిసే తేదీకి ముందు 45 (నలభై-ఐదు) రోజుల వ్యవధిలో ఆ రాబోయే గడువు ముగింపు సమయం గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ-మెయిల్/ఫోన్/నోటిఫికేషన్ లేదా అనుమతించతగిన ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతిలో ఈ విషయాన్ని తెలియచేస్తుంది. గడువు ముగిసిన తర్వాత మీ PhonePe వాలెట్‌లో నగదు ఉన్నట్లయితే, మీ PhonePe వాలెట్ గడువు ముగిసిన తర్వాత ఎప్పుడైనా, PhonePe వాలెట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను రీఫండ్ చేయమని మీరు PhonePeను కోరవచ్చు. మీరు ఇంతకు ముందు మీ PhonePe వాలెట్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌కు లేదా రీఫండ్ కోరుతూ అభ్యర్థన చేసిన సమయంలో మీరు PhonePeకు అందించిన బ్యాంక్ అకౌంట్‌‌కు ఆ బ్యాలెన్స్‌ బదిలీ అవుతుంది. అయినప్పటికీ, eGVలు బ్యాంక్ అకౌంట్‌కు రీఫండ్ కావు, అలానే PhonePe సొంత అభీష్టానుసారం తరువాతి కాలంలో వాటిని ఉపయోగించుకునే విధంగా పునరుద్ధరిస్తారు. మీరు ఏదైనా అనుమానాస్పద లావాదేవీలో పాల్గొన్నా మరియు/లేదా RBI జారీ చేసిన నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించే విధంగా ఏదైనా లావాదేవీని నిర్వహించినా, మీ PhonePe వాలెట్‌ను డెబిట్ ఓన్లీ మోడ్‌కు మార్చే హక్కు PhonePeకు ఉంది. ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌ల వినియోగాన్ని నియంత్రించినప్పుడు, ఇది  మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఉన్న నియమాలు, నిబంధనలు, అలానే వాటికి సంబంధించిన ఏవైనా సవరణలకు మాత్రమే పరిమితం కాదు, అటువంటి సందర్భంలో, ఈ విషయాన్ని RBIకి PhonePe నివేదించవచ్చు, అలానే దర్యాప్తులో కొనుగొన్న విషయాలు, RBI నుండి స్పష్టమైన నివేదిక అందే వరకు మీ PhonePe వాలెట్‌ను నిలిపివేయవచ్చు..
  • ఒకవేళ మీ PhonePe వాలెట్‌లో లేదా గత 12 నెలల్లో ఎటువంటి లావాదేవీలు జరగనట్లయితే, మీ PhonePe వాలెట్‌ను ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌గా ఫ్లాగ్ చేస్తారు. PhonePe ఎప్పటికప్పుడు నిర్వచించిన డ్యూ-డిలిజెన్స్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ PhonePe వాలెట్‌ను మీరు ఆపరేట్ చేయగలరు. మీ PhonePe వాలెట్ బ్యాలెన్స్‌ను మేము సురక్షితంగా నిర్వహిస్తాము, ఏవైనా రీఫండ్‌లు పెండింగ్‌లో ఉంటే అవి ఇప్పటికీ మీ PhonePe వాలెట్‌లోకి క్రెడిట్ అవుతాయి. ప్రచార కమ్యూనికేషన్ సహా అన్ని కమ్యూనికేషన్ రూపాలలోనూ మీకు సమాచారం ఇవ్వడం కొనసాగుతుంది. అయితే, డ్యూ-డిలిజెన్స్ ప్రక్రియ పూర్తి చేయకుండా మీ PhonePe వాలెట్‌ను లోడ్ చేయడంతో సహా ఎలాంటి లావాదేవీల కోసమైనా మీ PhonePe వాలెట్‌ను ఉపయోగించలేరు.

సేవల నిలిపివేత/ఆపివేత

  • మీ PhonePe వాలెట్‌ను మూసివేయాలనుకుంటే, వన్ టైమ్ ఆప్షన్‌గా, స్మాల్ PPI PhonePe వాలెట్ విషయంలో, PhonePe వాలెట్ లోడ్ చేయడానికి ఉపయోగించిన సోర్స్ అకౌంట్‌కు మీ నిధులు రీఫండ్ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే, ఫుల్ KYC వాలెట్ విషయంలో, మీరు ముందుగా-కేటాయించిన, అలానే PhonePe ధృవీకరించిన సొంత బ్యాంక్ అకౌంట్‌కు నిధులను తిరిగి బదిలీ చేయవచ్చు.
  • మీ PhonePe వాలెట్‌ను వెంటనే క్లోజ్ చేయకపోయినప్పటికీ, ముందుగా నిలిపివేసి, ఆ తర్వాత క్రమంగా క్లోజ్ చేయాల్సినటువంటి, ప్రమాద కారక పరిస్థితులు కొన్ని ఉన్నాయని మీరు అంగీకరించి, గుర్తిస్తున్నారు..
  • మీ PhonePe వాలెట్‌ను ఒకసారి క్లోజ్ చేసినట్లయితే, మేము మీ PhonePe వాలెట్‌ను పునరుద్ధరించలేము, అలానే కొన్ని సందర్భాలలో రెగ్యులేటరీ ఆదేశాల ప్రకారం లేదా మా అంతర్గత విధానాలను బట్టి కొత్త వాలెట్‌ను క్రియేట్ చేయడానికి కూడా మీకు అనుమతి ఇవ్వకపోవచ్చు అని మీరు అర్థం చేసుకున్నారు.
  • మీ PhonePe వాలెట్‌ను నిలిపివేసిన తర్వాత కూడా, రికార్డులను భద్రపర్చే ఉద్దేశంతో, మీ డేటా, సమాచారాన్ని దాయాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని మీరు అర్థం చేసుకున్నారు.

అనధికార లావాదేవీలు, ఫిర్యాదుల పరిష్కారం

  • మీ PhonePe వాలెట్/eGV నుంచి నగదు డెబిట్‌ అయినట్లయితే, ఆ లావాదేవీ హెచ్చరికలను SMS లేదా ఈమెయిల్ రూపంలో PhonePe షేర్ చేస్తుంది. ఒకవేళ మీ అకౌంట్‌లో మీ సమ్మతి/ఆథరైజేషన్ లేకుండా జరిగిన ఏదైనా లావాదేవీని గమనించినట్లయితే, గ్రీవెన్స్ పాలసీ(ఫిర్యాదుల విధానం) కింద, PhonePeలో అందుబాటులో ఉన్న అత్యవసర 24×7 సంప్రదింపు నంబర్/ఈమెయిల్/ ఫారమ్‌ల ద్వారా అలాంటి లావాదేవీ గురించి మీరు వెంటనే మాకు తెలియచేయాలి.
  • మీరు ఏదైనా లావాదేవీ అనధికారికంగా జరిగిందని తెలిపిన తర్వాత, మేము మీ ఫిర్యాదును సమీక్షిస్తున్నప్పుడు మీ PhonePe వాలెట్/eGVని కూడా మేము తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఫిర్యాదుపై విచారణ చేస్తున్నప్పుడు, క్లెయిమ్ చేసిన నిధులను వివాదంలో ఉన్న నిధులుగా గుర్తిస్తాము, విచారణ ఫలితం మీకు అనుకూలంగా వచ్చినట్లయితే, మీ PhonePe వాలెట్/eGVలోకి అమౌంట్‌ను క్రెడిట్ చేస్తాము.
  • PhonePeలో PhonePe స్వీయ తప్పిదం వల్ల జరిగిన మోసం / నిర్లక్ష్యం / లోపం కారణంగా అనధికార లావాదేవీ ప్రాసెస్ జరిగినట్లయితే, మీ PhonePe వాలెట్ / eGVకి నిధులను తిరిగి చెల్లిస్తాము.
  • మీ నిర్లక్ష్యం కారణంగా నష్టం జరిగిన సందర్భాల్లో, అంటే మీ పేమెంట్ క్రెడెన్షియల్స్‌ను ఎవరికైనా షేర్ చేయడం వంటి కారణాల వల్ల జరిగినట్లయితే, అటువంటి అనధికార లావాదేవీని మాకు తెలియచేసినంత వరకు మొత్తం నష్టాన్ని మీరే భరించాలి. మీరు అనధికారిక లావాదేవీని మాకు నివేదించిన తర్వాత మీ PhonePe వాలెట్ / eGVలకు సంబంధించిన తదుపరి నష్టానికి మీరు బాధ్యత వహించక్కర్లేదు.
  • ఏదైనా థర్డ్ పార్టీ వల్ల ఉల్లంఘన జరిగినప్పుడు, అంటే మీ తరఫున లేదా మా తరఫున లోపం ఏదీ లేనప్పటికీ, సిస్టమ్‌లో మరెక్కడైనా లోపం ఉండటం వల్ల ఉల్లంఘన జరిగినప్పుడు, అటువంటి అనధికార లావాదేవీ గురించి, ఆ లావాదేవీ రసీదు మీకు అందిన తేదీ(PhonePe నుండి మీకు లావాదేవీ సమాచారం వచ్చిన తేదీని మినహాయించాలి) నుండి 3 (మూడు) రోజులలోపు మాకు తెలియచేయాలి. ఈ విషయంలో మీరు విఫలమై, (ఎ) నాలుగు నుంచి ఏడు రోజుల మధ్యలో మాకు సమాచారం ఇచ్చినట్లయితే, అటువంటి లావాదేవీకి సంబంధించిన నష్టాన్ని లావాదేవీ విలువ లేదా ఒక లావాదేవీకి ₹ 10,000/- వరకు చొప్పున, వీటిలో ఏది తక్కువ అయితే అంత మొత్తాన్ని మీరే భరించాలి లేదా (బి) ఏడు రోజుల తర్వాత మాకు తెలిపినట్లయితే, మా బోర్డు ఆమోదించిన పాలసీ ద్వారా నిర్వచించిన మేరకు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.
  • మా విచారణను 90 (తొంభై) రోజుల్లోగా పూర్తి చేయలేకపోతే, RBI ఆదేశాలు, ఇంకా మా విధానాల ప్రకారం మీ PhonePe వాలెట్ లేదా eGVకి నిధులను రీఫండ్ చేస్తాము.
  • మీ PhonePe వాలెట్ / eGVలను నియంత్రించే అన్ని నియమాలు, షరతులను SMS/లింక్‌లు/నోటిఫికేషన్/ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతిలో PhonePe మీకు తెలియచేస్తుంది. ఛార్జీలు, ఫీజుల వివరాలు, మీ PhonePe వాలెట్/PPI గడువు ముగియు కాలవ్యవధి, ఇంకా నోడల్ ఆఫీసర్ వివరాలను PhonePe వాలెట్/eGV జారీ చేసిన సమయంలోనే తెలియచేస్తుంది. ఈ వివరాలు అన్నీ PhonePe ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైనా సమీక్షించవచ్చు.

ఒకవేళ మీరు ఏదైనా ఫిర్యాదు / సమస్యను మాకు తెలియచేసినట్లయితే, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందిని సమీక్షించి, మీ ఫిర్యాదు / సమస్యను 48 (నలభై ఎనిమిది) గంటలలోపు పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము, కానీ మీ ఫిర్యాదు / సమస్యను మేము స్వీకరించిన తేదీ నుండి 30 (ముప్పై) రోజుల తర్వాత మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయము. మరిన్ని వివరాల కోసం మీరు మా గ్రీవెన్స్ పాలసీని చూడండి.

లావాదేవీ పర్యవేక్షణ

  • మీ PhonePe వాలెట్ / eGVకి వర్తించే మొత్తం లావాదేవీ పరిమితి(ల) వరకు అనుమతించిన మర్చెంట్‌లు, అలానే అనుమతించిన ప్రయోజనాల కోసం మీ PhonePe వాలెట్ / eGVని ఉపయోగించడానికి మీకు అనుమతి ఉంది. అయితే, మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచడానికి, మీ లావాదేవీలు భద్రంగా జరగడానికి వీలుగా రిస్క్‌లను గుర్తించడం కోసం మీ లావాదేవీ, అకౌంట్ కార్యకలాపాలను మేము పర్యవేక్షిస్తాము, అలానే మా పర్యవేక్షణ, రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతుల ఆధారంగా మేము రూపొందించబోయే ప్రమాద దృక్కోణాన్ని పరిగణనలోకి తీసుకుని,  మీ PhonePe వాలెట్/eGVపై పరిమితులు/ఆంక్షలు/సస్పెన్షన్‌ను విధించాలని నిర్ణయించుకోవచ్చు.
  • మీ అకౌంట్‌ను మేము సమీక్షించడానికి, మీ PhonePe మొబైల్ అప్లికేషన్‌లో పొందే సేవలతో సహా మీ PhonePe అకౌంట్‌ను సమీక్షించడానికి మాకు అధికారం ఇవ్వాలని అర్థం చేసుకుని, అనుమతి ఇస్తున్నారు.
  • PhonePe అప్లికేషన్‌లో అందించే ఏవైనా సేవలకు సంబంధించి మీ PhonePe అకౌంట్‌లో మేము ఏవైనా క్రమరాహిత్యాలు జరిగినట్లుగా గుర్తిస్తే, మీ PhonePe అకౌంట్ వినియోగాన్ని మేము బ్లాక్/సస్పెండ్/పరిమితి/నియంత్రణ చేయాల్సి ఉంటుందని కూడా మీరు అంగీకరిస్తున్నారు.

PPI వినియోగాన్ని నిషేధించిన అంశాలు, యూజర్ ప్రవర్తన, బాధ్యతలు

  • మీరు ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా సంస్థ లాగా నటించకూడదు, ఏదైనా వ్యక్తి లేదా సంస్థతో ఉన్న అనుబంధాన్ని తప్పుడు వివరాలతో క్లెయిమ్ చేయకూడదు లేదా తప్పుగా సూచించకూడదు, లేదా అనుమతి లేకుండా ఇతరుల అకౌంట్‌లను యాక్సెస్ చేయకూడదు, మరొక వ్యక్తి డిజిటల్ సంతకాలను ఫోర్జ్(నకిలీ సంతకాలు సృష్టించడం) చేయకూడదు లేదా ఏదైనా ఇతర మోసపూరిత కార్యకలాపానికి పాల్పకూడదు.
  • PhonePeను, మా అనుబంధ సంస్థలను లేదా ఇతర సభ్యులను లేదా యూజర్‌లను మోసం చేయడానికి లేదా ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు (చట్ట ప్రకారం నిషేధించిన ప్రోడక్ట్‌లు లేదా సేవలకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేకుండా వ్యవహరించడంతో పాటు) కోసం మీరు PhonePe వాలెట్‌ను ఉపయోగించకూడదు.
  • మీరు మోసపూరిత నిధులను ఉపయోగించి దేనినీ (ప్రోడక్ట్‌లు లేదా సేవలు) కొనుగోలు చేయకూడదు, ఇంకా మనీలాండరింగ్, పన్ను ఎగవేత లేదా ఏదైనా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం PhonePe వాలెట్‌ను ఉపయోగించకూడదు.
  • మీరు ఫిర్యాదులు, వివాదాలు, జరిమానాలు విధించడం, పెనాల్టీలు, ఛార్జీలు లేదా ఏదైనా ఇతర బాధ్యతను PhonePeకు కలిగించే విధంగా PhonePe వాలెట్/eGV బ్యాలెన్స్‌లను ఉపయోగించకూడదు.
  • మీ PhonePe వాలెట్/eGVని ఉపయోగించి మీరు లావాదేవీలు జరుపుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి, ఒకవేళ మీరు ఎవరైనా మర్చెంట్‌కు లేదా మరే ఇతర వ్యక్తికి ఏదైనా మొత్తాన్ని అనుకోకుండా/తప్పుగా బదిలీ చేసినట్లయితే, PhonePe అటువంటి మొత్తాన్ని మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించే బాధ్యత తీసుకోదు.
  • థర్డ్ పార్టీ సైట్‌కు మిమ్మల్ని తీసుకెళ్లే వెబ్-లింక్ ఏదైనా వెబ్‌సైట్‌లో ఉన్నట్లయితే, అది ఆ వెబ్-లింక్‌ను ఆమోదిస్తున్నట్లుగా కాదు. అటువంటి వేరే వెబ్-లింక్‌ను ఉపయోగించినా లేదా బ్రౌజ్ చేసినా, అటువంటి ప్రతి వెబ్-లింక్‌లోని నియమాలు, షరతులకు మీరు లోబడి ఉండాలి, అంతేకాక అటువంటి వెబ్‌సైట్/అప్లికేషన్‌ను ఉపయోగించే ముందు దానికి సంబంధించిన నియమాలు, షరతులను మీరు సమీక్షించుకోవాలి.
  • PhonePe కస్టమర్ కమ్యూనికేషన్‌లు అన్నింటినీ SMS/ ఈమెయిల్‌/ నోటిఫికేషన్ లేదా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతుల్లో పంపుతుంది, వాటి డెలివరీ ప్రక్రియను SMS/ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌లకు సమర్పించిన తర్వాత, మీరు వాటిని స్వీకరించినట్లుగానే పరిగణిస్తారు. అందుకే మీరు అటువంటి కమ్యూనికేషన్‌లు అన్నింటినీ సమీక్షించాలి, అలానే వాటిలో ఏదైనా సమస్య లేదా సందేహం ఉంటే మాకు తిరిగి తెలియచేయాలి.
  • మీరు PhonePe/ మర్చెంట్‌ల నుండి అన్ని లావాదేవీల, ప్రచార సందేశాలను స్వీకరించడానికి అంగీకరిస్తున్నారు. అయితే, మీరు ప్రచార సందేశాలు వద్దు అనుకుంటే, అటువంటి ఈమెయిల్‌లలో ఉండే ఆప్ట్-అవుట్(నిలిపివేత) ఎంపికను ఉపయోగించి లేదా PhonePe మీకు అందుబాటులో ఉంచిన ఏదైనా ఇతర మాధ్యమం ద్వారా మీ ఇష్టాన్ని తెలియచేసి, అలాంటి సందేశాలు ఇకపై మీకు రాకుండా నిలిపివేయవచ్చు.
  • మీరు PhonePe వాలెట్ మరియు/లేదా eGVని సంపూర్ణమైన విశ్వాసంతో, వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాలి, అలానే మర్చెంట్ నుంచి కొనుగోలు చేసిన లేదా సరఫరా చేసిన ఏవైనా ప్రోడక్ట్‌లు లేదా సేవలపై విధించే లేదా ఏవైనా లావాదేవీల నుంచి ఉత్పన్నమయ్యే ఏవైనా పన్నులు, సుంకాలు లేదా ఇతర ప్రభుత్వ పన్నులు లేదా ఏవైనా ఆర్థిక ఛార్జీల చెల్లింపునకు మీరే పూర్తిగా బాధ్యత వహించాలి.
  • విదేశీ కరెన్సీలో లావాదేవీల కోసం PhonePe వాలెట్‌ను ఉపయోగించకూడదని మీరు నిర్ధారించుకోవాలి. PhonePe వాలెట్‌ను భారతదేశంలో మాత్రమే జారీ చేస్తారు & ఇక్కడ మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ఇంకా భారతదేశంలో ఉన్న మార్చెంట్‌ల కోసం మాత్రమే పనిచేస్తుంది.
  • మీరు PhonePe సేవల ద్వారా మర్చెంట్ ప్లాట్‌ఫామ్ నుండి వస్తువులు లేదా ఏవైనా ఇతర సేవలను పొందినప్పుడు, మీకు, ఇంకా మర్చెంట్‌కు మధ్య ఉన్న ఒప్పందంలో మేము ఒక పార్టీ కాదని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. మేము తమ వెబ్‌సైట్ లేదా యాప్‌కి లింక్ అయి ఉన్న ఎవరైనా మర్చెంట్ లేదా ప్రకటనకర్తను మేము బలపర్చము. ఇంకా, మీరు ఉపయోగించే మర్చెంట్ సేవను పర్యవేక్షించాల్సిన బాధ్యత మాకు లేదు; వారెంటీలు లేదా హామీలతో సహా ఒప్పందం(పరిమితులు ఏవీ లేకుండా) ప్రకారంగా వర్తించే అన్ని బాధ్యతలకు మర్చెంట్ మాత్రమే బాధ్యత వహిస్తారు. ఎవరైనా మర్చెంట్‌తో ఏదైనా వివాదం తలెత్తినా లేదా ఫిర్యాదు ఉన్నా, యూజర్ దాన్ని నేరుగా మర్చెంట్‌తోనే పరిష్కరించుకోవాలి. PhonePe సేవలను ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు మరియు/లేదా సేవల్లో ఏదైనా లోపానికి మేము బాధ్యత వహించము లేదా బాధ్యులము కాదు అని స్పష్టం చేస్తున్నాము. ఏదైనా వస్తువు మరియు/లేదా సేవను కొనుగోలు చేసే ముందు దాని నాణ్యత, పరిమాణం, ఫిట్‌నెస్‌కు సంబంధించి మీరు స్వయంగా సంతృప్తి చెందిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని మీకు సూచిస్తున్నాము.

కమ్యూనికేషన్

  • PhonePe ప్లాట్‌ఫామ్‌లో లేదా PhonePe ప్లాట్‌ఫామ్ ద్వారా ఏదైనా థర్డ్ పార్టీ ప్రోడక్ట్‌లు లేదా సేవల కోసం సైన్‌అప్ చేయడం, లావాదేవీలు చేయడం లేదా పొందడం వంటి వాటితో సహా, మీరు కార్యకలాపాలు నిర్వహించిన సమయంలో అందించిన సంప్రదింపు సమాచారంపై మాట్లాడేందుకు PhonePe మిమ్మల్ని సంప్రదించవచ్చు.
  • మేము మీకు ఈమెయిల్‌లు లేదా SMS లేదా పుష్ నోటిఫికేషన్‌ల ద్వారా లేదా ఇతర ఆధునిక సాంకేతికత ద్వారా కమ్యూనికేషన్ హెచ్చరికలను పంపుతాము. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, మీరు తప్పు ఈమెయిల్‌ చిరునామాను ఇవ్వడం, నెట్‌వర్క్ అంతరాయాలు వంటి వాటితో సహా మా నియంత్రణలో లేని అంశాల కారణంగా కమ్యూనికేషన్‌లలో అంతరాయం ఏర్పడవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. సమాచారం ఆలస్యం కావడం, అడ్డంకులు ఏర్పడటం లేదా కమ్యూనికేషన్ వైఫల్యం కారణంగా ఏదైనా అలర్ట్‌ను అందించనందుకు లేదా ఏదైనా నష్టానికి PhonePeను బాధ్యులుగా చేయకూడదని మీరు అంగీకరిస్తున్నారు.
  • మాకు మీరు షేర్ చేసిన కాంటాక్ట్ వివరాలకు మీరే బాధ్యత వహిస్తారని, మీ కాంటాక్ట్ వివరాలలో ఏదైనా మార్పు జరిగినప్పుడు, ఆ వివరాలను మాకు అప్‌డేట్ చేస్తారని మీరు అంగీకరిస్తున్నారు. ఏదైనా PhonePe సేవ లేదా ఆఫర్(ల)కు సంబంధించి మిమ్మల్ని సంప్రదించడానికి, మీకు సమాచారం ఇవ్వడానికి మీరు మాకు అధికారం ఇస్తున్నారు. మేము హెచ్చరికలను పంపడానికి లేదా మీతో కమ్యూనికేట్ చేయడానికి థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లను మేము ఉపయోగించవచ్చు.  కాల్‌లు, SMS, ఈమెయిల్‌లు, ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతిలో మిమ్మల్ని సంప్రదించడానికి, DND సెట్టింగ్‌లను సవరించడానికి మీరు PhonePe, PhonePe ఎంటిటీలకు అధికారం ఇచ్చారు.

వివాదాలు

  • మీ PhonePe వాలెట్ వినియోగం, ఆపరేషన్‌కు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే 30 రోజులలోపు మాకు తెలియచేయాలి, ఆ వ్యవధి దాటిన తర్వాత అటువంటి ఫిర్యాదు/సంఘటనకు మేము బాధ్యత వహించము. అయితే, మీ నుండి వివాదానికి సంబంధించిన ఫిర్యాదును స్వీకరించినప్పుడు, మేము మీ వివాదాన్ని ప్రత్యేకమైన ట్రాకింగ్ రెఫరెన్స్ ద్వారా గుర్తించి, దానిని ధృవీకరిస్తాము.
  • ఏవైనా వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోతే, కింద ప్రస్తావించిన నియంత్రణ చట్టం, అధికార పరిధి ప్రకారం పరిష్కరించుకోవాలని సూచిస్తాము.

Iనష్టపరిహారం, బాధ్యత పరిమితి

  • ఈ వినియోగ నియమాలు మన పరస్పర హక్కులు, బాధ్యతలు, తప్పకుండా పాటించాల్సిన విషయాలను నియంత్రిస్తాయి, అయితే ఇవి నియంత్రణ సంస్థల నోటిఫికేషన్‌లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఆ ప్రాంతంలో అమలు అవుతున్న చట్టాల్లో మార్పులు లేదా PhonePe అంతర్గత విధానాలు, పద్ధతులకు మాత్రమే పరిమితం కాకుండా, పలు అంశాలు నిర్దేశించిన ప్రకారంగా మార్పులకు గురవుతాయి. 
  • కాంట్రాక్టు వల్ల, నిర్లక్ష్యం వల్ల, హాని కలిగించడం/తప్పు చేయడం వల్ల, లేదా PhonePe వాలెట్ లేదా eGVని ఉపయోగించడం లేదా సరిగ్గా ఉపయోగించడం రాకపోవడం వల్ల లాభాలను లేదా ఆదాయాలను కోల్పోవడం, వ్యాపారానికి అంతరాయం కలగడం, వ్యాపార అవకాశాలు కోల్పోవడం, డేటాను కోల్పోవడం, లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలకు నష్టం చేకూరితే – ఏదైనా పరోక్షంగా, పర్యవసానాల వల్ల, అనుకోని విధంగా తలెత్తడం వల్ల, ప్రత్యేకమైన లేదా శిక్షార్హమైన డ్యామేజీలకు, వీటితో పాటు ఇలాంటి ఇతర డ్యామేజీలకు PhonePe ఏ రకంగానూ బాధ్యత వహించదు. అయితే మీరు PhonePe వాలెట్ లేదా eGVలను ఉపయోగించిన సేవకు సంబంధించి కాంట్రాక్టు వల్ల, నిర్లక్ష్యం వల్ల, హాని కలిగించడం/తప్పు చేయడం వల్ల, వారెంటీ వల్ల లేదా ఇతరత్రా కారణాల వల్ల, మీరు చెల్లించిన దాని కంటే ఎక్కువ నష్టం జరిగితే అందుకు తగ్గ పరిహారం లేదా వంద రూపాయలు (రూ. 100) – ఈ రెండింటిలో  దేని విలువ తక్కువగా ఉంటే అది చెల్లించబడుతుంది.

వాలెట్ వినియోగ నియమాల సవరణ

  • ఈ వాలెట్ వినియోగ నియమాలు మన పరస్పర హక్కులు, బాధ్యతలు, తప్పకుండా పాటించాల్సిన అంశాలను నియంత్రిస్తాయి. అయితే ఇవి నియంత్రణ సంస్థల నోటిఫికేషన్‌లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఆ ప్రాంతంలో అమలు అవుతున్న చట్టాల్లో మార్పులు లేదా PhonePe అంతర్గత విధానాలు, పద్ధతులకు మాత్రమే పరిమితం కాకుండా, పలు అంశాలు నిర్దేశించిన ప్రకారంగా మార్పులకు గురవుతాయి.
  • ఈ వాలెట్ వినియోగ నియమాలు మా ప్రస్తుత పద్ధతులు, విధానాలు, ప్రోడక్ట్ ఫీచర్లు, అలానే నియంత్రణ సంస్థలు జారీ చేసిన మార్పులు, చట్టంలో మార్పులను ప్రతిబింబిస్తాయి. అందుకు అనుగుణంగా మేము వాలెట్ వినియోగ నియమాలను అప్‌డేట్ చేస్తాము, అలానే మీరు కూడా మీ PhonePe వాలెట్/eGVని ఉపయోగిస్తున్నప్పుడు ఆ నియమాలను సమీక్షించవలసి ఉంటుంది. మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ వినియోగాన్ని, దానిలో కార్యకలాపాలను కొనసాగించినట్లయితే, ఈ వాలెట్ వినియోగ నియమాలను మీరు ఆమోదించినట్లుగానే మేము పరిగణిస్తాము.
  • మీ PhonePe వాలెట్/eGVలను అనుమతించతగిన నియంత్రణ సంస్థల ఆదేశాల ఆధారంగా జారీ చేస్తాము, అలానే ఆయా ఆదేశాలలో ఏదైనా మార్పు జరిగితే, అది మీ PhonePe వాలెట్/eGV తాత్కాలిక నిలిపివేత/శాశ్వత నిలిపివేత సహా ఆపరేషన్, జారీపై ప్రభావం చూపుతుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. అయితే, ఆ ప్రభావాన్ని ఆయా మార్పుల ఆదేశాలు మాత్రమే నిర్దేశిస్తాయి, అవి ఈ వాలెట్ వినియోగ నియమాల్లో ఉండకపోవచ్చు.

మేధో సంపత్తి హక్కులు

  • ఈ వాలెట్ వినియోగ నియమాల కోసం ఉద్దేశించిన ప్రకారం మేధో సంపత్తి హక్కులు ఎల్లప్పుడూ ఇక్కడ పేర్కొన్న విధంగా వర్తిస్తాయి. వీటిలో కాపీరైట్‌లు కూడా ఉంటాయి. ఈ కాపీరైట్‌లు రిజిస్టర్ చేసినవి కావచ్చు, చేయనవి కూడా కావచ్చు. వీటిలో పేటెంట్‌ల కోసం దాఖలు చేసే హక్కులు, ట్రేడ్‌మార్క్‌లు, వ్యాపార పేర్లు, వ్యాపారాన్ని సూచించే డ్రెస్సులు, ఇంటి గుర్తులు, సామూహిక గుర్తులు, అనుబంధ గుర్తులతో పాటు రిజిస్టర్ చేసుకోవడానికి ఉన్న హక్కు కూడా ఉంటుంది. పారిశ్రామిక డిజైన్లు, పారిశ్రామిక లేఅవుట్, భౌగోళిక సూచికలు, నైతిక హక్కులు, ప్రసార హక్కులు, డిస్‌ప్లే హక్కులు, పంపిణీ హక్కులు, విక్రయ హక్కులు, సంక్షిప్త హక్కులు, అనువదించే హక్కులు, తిరిగి ఉత్పత్తి చేయగలిగే హక్కులు, ప్రదర్శన హక్కులు, కమ్యూనికేట్ చేయగలిగే హక్కులు, అడాప్ట్‌ చేసుకోగలిగే హక్కులు, సర్క్యులేట్‌ చేయగలిగే హక్కులు, రక్షిత హక్కులు, ఉమ్మడి హక్కులు, పరస్పర హక్కులు, ఉల్లంఘన హక్కులు ఉంటాయి. డొమైన్ పేర్లు, ఇంటర్నెట్ లేదా వర్తించే చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర హక్కు ఫలితంగా ఉత్పన్నమయ్యే అన్ని మేధో సంపత్తి హక్కులు, PhonePe లేదా PhonePe ఎంటిటీలకు చెంది ఉంటాయి. అలాంటి డొమైన్‌ పేరుకు ఈ సంస్థలు ఓనర్‌గా ఉంటాయి. ఇక్కడ పేర్కొన్న ఏ మేధో సంపత్తి హక్కులలో ఏ భాగాన్ని కూడా వినియోగదారు పేరు మీదకు బదిలీ చేయకూడదని, ఇందులోని పార్టీలు అంగీకరిస్తూ నిర్ధారిస్తున్నాయి. PhonePe వాలెట్ లేదా eGV లేదా ఈ ఒప్పందాన్ని నిర్వహించిన సందర్భంగా ఉత్పన్నమయ్యే ఏవైనా మేధో సంపత్తి హక్కులపై సంపూర్ణ యాజమాన్యం, వాటిని సంపూర్ణంగా కలిగి ఉండే హక్కు, మా కంట్రోల్‌లో లేదా పరిస్థితిని బట్టి మేము లైసెన్స్‌ ఇచ్చిన వారి కంట్రోల్‌లో మాత్రమే ఉంటుంది.
  • ఇమేజ్‌లు, ఇల్లుస్ట్రేషన్స్‌, ఆడియో క్లిప్‌లు, వీడియో క్లిప్‌లతో సహా PhonePe ప్లాట్‌ఫామ్‌లోని మెటీరియల్ మొత్తం PhonePe, PhonePe ఎంటిటీలు లేదా వ్యాపార భాగస్వాముల కాపీరైట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇతర మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించబడుతోంది. వెబ్‌సైట్‌లోని మెటీరియల్‌ను మీ వ్యక్తిగత, వాణిజ్యేతర అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. మీరు ఈమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి అంశాలను కాపీ, రీప్రొడ్యూస్, రీపబ్లిష్‌, అప్‌లోడ్‌, పోస్ట్‌, ట్రాన్స్‌మిట్‌ లేదా డిస్ట్రిబ్యూట్‌ చేయకూడదు. అంతే కాకుండా అలా చేయడానికి మీరు ఏ ఇతర వ్యక్తికి సహాయం చేయకూడదు. మెటీరియల్‌ యజమాని నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మెటీరియల్స్‌లో మాడిఫికేషన్స్ చేయడం, ఏదైనా ఇతర ప్లాట్‌ఫారమ్‌లో లేదా నెట్‌వర్క్‌ ఉన్న కంప్యూటర్ ఎన్విరాన్‌మెంట్‌లో మెటీరియల్స్‌ను ఉపయోగించడం, లేదా వ్యక్తిగత, వాణిజ్యేతర ఉపయోగం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం మెటీరియల్స్‌ను ఉపయోగించడం అన్నది కాపీరైట్స్‌, ట్రేడ్‌మార్క్‌లు, ఇతర యాజమాన్య హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది, అలా చేయడాన్ని నిషేధించడమైనది.

నియంత్రించే చట్టం/చట్ట పరిధులు

  • ఈ అగ్రిమెంట్, దాని కింద ఉన్న హక్కులు, బాధ్యతలు, దీనిలోని పార్టీల మధ్య సంబంధాలు, అగ్రిమెంట్ రూపకల్పన, చెల్లుబాటు, పనితీరు లేదా రద్దుతో సహా ఈ వినియోగ నియమాల వల్ల లేదా వీటితో తలెత్తే అన్ని అంశాలు, గణతంత్ర భారతదేశపు చట్టాలకు అనుగుణంగా రూపొందిచబడ్డాయి, ఆ చట్టాల పర్యవేక్షణకు లోబడి ఉంటాయి.
  • ఒకవేళ PhonePe వాలెట్ లేదా eGV వినియోగానికి సంబంధించి తలెత్తే లేదా వినియోగంతో ఉన్న కనెక్షన్‌ ఏదైనా కారణంగా పార్టీల మధ్య ఏ రకంగానైనా ఏదైనా వివాదం లేదా విభేదం తలెత్తితే మీరు, PhonePe నిర్ణీత ఉద్యోగి లేదా అధికారి ప్రతినిధి తప్పనిసరిగా, సదుద్దేశంతో వివాదానికి లేదా విబేధానికి ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని సాధించడానికి లేదా సెటిల్‌మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి
  • ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఏదైనా వివాదాన్ని లేదా విబేధాన్ని లేదా దాని పరిష్కారానికి తీసుకున్న చొరవను, సంబంధిత పార్టీలు తమ ముందున్న బాధ్యతలను నిర్వర్తించకుండా వాయిదా వేయకూడదు లేదా జాప్యం చేయకూడదు. అయితే ఇక్కడ ఏది ఉన్నప్పటికీ, పార్టీలు ఏదైనా నిరంతర ఉల్లంఘనను నిరోధించడానికి చట్టపరమైన చర్యలు ప్రారంభించే హక్కును కలిగి ఉంటాయి, అలాగే ఇంజెక్షన్‌ను కోరవచ్చు లేదా అలాంటి ఇతర ఉపశమనాన్ని పొందవచ్చు.
  • పక్షపాతం లేకుండా సామరస్య పరిష్కారం ప్రయత్నించి అది కుదరనప్పుడు, మీ PhonePe వాలెట్ లేదా eGV లేదా ఇందులో కవర్ అయిన ఇతర విషయాల ఉపయోగం వల్ల తలెత్తే అన్ని రకాల సమస్యలకు, లేదా ఇక్కడ పేర్కొన్న విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, తీర్పు చెప్పడానికి కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న కోర్టులు ప్రత్యేకమైన చట్టపరిధిని కలిగి ఉంటాయి.

సాధారణ నియమాలు

  • మా అన్ని హక్కులు, టైటిల్స్‌, బెనిఫిట్స్‌, ప్రయోజనాలు, బాధ్యతలను, ఇంకా విధులతో సహా ఈ అగ్రిమెంట్‌ను మా అనుబంధ సంస్థలకు, వీటి ప్రయోజనాలను పొందే హక్కు ఉన్న సక్సెసర్లకు బదిలీ చేసే హక్కును PhonePe కలిగి ఉంటుంది. ఇక్కడ పేర్కొన్న PhonePe నిర్ణీత హక్కులను, బాధ్యతలను PhonePe, స్వతంత్ర కాంట్రాక్టర్లకు లేదా ఇతర థర్డ్ పార్టీలకు డెలిగేట్‌ చేయవచ్చు. మా స్వంత నిర్ణయానుసారం ఎప్పుడైనా వెనక్కి తీసుకోగలిగిన, ముందస్తుగా రాతపూర్వకంగా ఇచ్చిన సమ్మతి లేకుండా మీరు ఈ అగ్రిమెంట్‌లో ఏదైనా భాగం కానీ పూర్తిగా కానీ మరొక వ్యక్తికి లేదా సంస్థకు బదిలీ చేయలేరు
  • “ఫోర్స్ మెజర్ (ఊహించని పరిణామం) సంఘటన” PhonePe నియంత్రణలో లేని ఏదైనా అనూహ్య సంఘటన అని అర్థం. యుద్ధం, అల్లర్లు, అగ్నిప్రమాదం, వరదలు, దైవిక చర్య, పేలుడు, ధర్నాలు, లాక్‌అవుట్‌లు, స్లోడౌన్‌లు, ఎక్కువ కాలం కొనసాగే ఎనర్జీ సరుకుల కొరత, పాండెమిక్, కంప్యూటర్ హ్యాకింగ్, కంప్యూటర్ డేటాకు, స్టోరేజీ పరికరాలకు అనధికారిక యాక్సెస్, కంప్యూటర్ క్రాష్‌లు, PhonePe సంస్థలను వారి కాంట్రాక్టు ప్రకారం వారి విధులను నిర్వహించకుండా అడ్డుకునే దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, వీటితో పాటు ఇలాంటి సంఘటనలు ఫోర్స్ మెజర్ కిందకు వస్తాయి.

నిరాకరణలు

  • ఒకవేళ ఈ అగ్రిమెంటు ఇంగ్లీష్ వెర్షన్‌కు, వేరొక భాషలోని వెర్షన్‌కు మధ్య ఏదైనా వైరుధ్యం ఉన్నట్లయితే, ఇంగ్లీష్ వెర్షన్ పరిగణనలోకి తీసుకోబడుతుంది.
  • ఈ అగ్రిమెంట్‌లో పేర్కొన్న ప్రకారం మా హక్కులను మేము ఉపయోగించుకోవడంలో విఫలమైతే ఆ హక్కులను మేము వదులుకున్నట్లు కాదు లేదా ఇలాంటి ఉల్లంఘన భవిష్యత్తులో జరిగితే ఆ హక్కులు మేము వదులుకుంటామని అర్థం కాదు. రాతపూర్వకంగా పేర్కొన్నప్పుడు మాత్రమే ఆ హక్కులను వదులుకున్నట్టు అర్థం.
  • ఒకవేళ అగ్రిమెంట్ నియమాలలో ఏదైనా చెల్లుబాటు కాకపోయినా లేదా అమలు పర్చలేకపోయినా, ఆ నియమం మాత్రం తొలగించబడుతుంది. మిగిలిన నియమాలు చెల్లుబాటు అవుతాయి, అమలు పరచబడతాయి.
  • శీర్షికలు సౌకర్యం కోసం మాత్రమే. అవి ఆయా విభాగాలను ఏ విధంగానూ నిర్వచించవు, పరిమితం చేయవు, విశ్లేషించవు లేదా ఆ విభాగం పరిధిని నిర్దేశించవు.
  • PhonePe లేదా థర్డ్ పార్టీ పార్ట్‌నర్‌ల సేవల నాణ్యత  గురించి వీటితో సహా కానీ వీటికి మాత్రమే పరిమితం కాకుండా, స్పష్టంగా లేదా సూచనగా ఎటువంటి హామీ ఇవ్వదు. i) సేవలు మీ అవసరాలకు తగినట్లుగా ఉంటాయని II) ఈ సేవలు అంతరాయం లేకుండా, సమయానుగుణంగా లేదా పొరపాట్లు లేకుండా ఉంటాయని; లేదా III) ఈ సేవలకు సంబంధించి ఏవైనా వస్తువులు, ప్రోడక్ట్‌లు లేదా పదార్థం మీ అవసరాలకు తగినట్లుగా ఉంటాయని,
  • కింద పేర్కొన్న కారణాల వల్ల వ్యవస్ఠ సరిగ్గా పనిచేయనప్పుడు మీరు సేవలను ఉపయోగించుకోలేకపోతే మీరు, PhonePe, మా అనుబంధ సంస్ఠలను బాధ్యులను చేయము అని అంగీకరిస్తున్నారు:
    • ఏదైనా సంప్రదింపు మార్గం ద్వారా వ్యవస్థ తాత్కాలిక నిలిపివేతను PhonePe ముందస్తుగానే ప్రకటించినప్పుడు;
    • టెలీకమ్యూనికేషన్ పరికరాలలో లేదా వ్యవస్థలో సమస్య కారణంగా డేటా ప్రసారంలో వైఫల్యం;
    • టైఫూన్, భూకంపం, సునామీ, వరదలు, విద్యుత్ సరఫరా అంతరాయం, యుద్ధం, తీవ్రవాద దాడులు లేదా మా నియంత్రణలో లేని ఇతర ఫోర్స్ మజూర్ సంఘటన కారణంగా వ్యవస్థ పనితీరులో వైఫల్యం; లేదా
    • హ్యాకింగ్, ప్రభుత్వ ఆదేశం, వెబ్‌సైట్ అప్‌గ్రేడ్, బ్యాంకులు లేదా PhonePe నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల సేవలకు అంతరాయం కలిగినప్పుడు.
  • స్పష్టంగా పేర్కొనబడితే తప్ప చట్టం మేరకు, PhonePe వాలెట్ లేదా eGV అందిస్తున్న సేవలు “ఎలా ఉన్నవి అలా”, “అందుబాటులో ఉన్నట్లు” “అన్ని లోపాలతో “ అందించబడతాయి. అన్ని రకాల హామీలు, రెప్రజెంటేషన్స్, నియమాలు, వాగ్దానాలు, షరతులు స్పష్టంగా లేదా సూచనగా వేరు చేయబడ్డాయి. సేవల ఉపయోగానికి సంబంధించి ఖచ్చితత్వం, సంపూర్ణత్వం, వాటి ఉపయోగం, PhonePe అందించే ఇతర సమాచారం లేదా సాధారణంగా అందుబాటులో ఉన్న దాన్ని అంచనా వేసుకోవాల్సిన బాధ్యత మీదే. మా తరపున ఎలాంటి హామీలు ఇవ్వడానికి ఎవరికీ అధికారం ఇవ్వడం లేదు, అలాంటి ఏ హామీని మీరు విశ్వసించకూడదు.
  • ఇతర పార్టీలతో మీకు ఏదైనా వివాదం ఉంటే మీరు PhonePeను (మా అనుబంధ సంస్థలు, ఆఫీసర్‌లు, డైరెక్టర్‌లు, ఏజెంట్‌లు ఇంకా ఉద్యోగులను) అన్ని రకాల తెలిసిన, తెలియని, ఈ వివాదాల కారణంగా తలెత్తే లేదా సంబంధం ఉన్న  దావాలు, డిమాండ్లు, నష్టపరిహారాల (వాస్తవికంగా ఉన్నవి, పర్యవసానమైనవి) నుండి విముక్తం చేస్తున్నారు.
  • ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా జరిగే నష్టాలన్నింటినీ మీరే భరిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. ఏదైనా వివాదం ఉంటే PhonePe వాలెట్ లేదా eGV ద్వారా మీరు చేసిన లావాదేవీలకు సంబంధించి PhonePe వద్దనున్న రికార్డులు  చట్టపరమైన రుజువుగా పరిగణించబడతాయి.
PhonePe Logo

Business Solutions

  • Payment Gateway
  • Guardian by PhonePe
  • Express Checkout
  • PhonePe Switch
  • Offline Merchant
  • Advertise on PhonePe
  • SmartSpeaker
  • Phonepe Lending
  • POS Machine

Insurance

  • Motor Insurance
  • Bike Insurance
  • Car Insurance
  • Health Insurance
  • Arogya Sanjeevani Policy
  • Life Insurance
  • Term Life Insurance
  • Personal Accident Insurance
  • Travel Insurance
  • Domestic Travel Insurance
  • International Travel Insurance

Investments

  • 24K Gold
  • Liquid Funds
  • Tax Saving Funds
  • Equity Funds
  • Debt Funds
  • Hybrid Funds

General

  • About Us
  • Careers
  • Contact Us
  • Press
  • Ethics
  • Report Vulnerability
  • Merchant Partners
  • Blog
  • Tech Blog
  • PhonePe Pulse

Legal

  • Terms & Conditions
  • Privacy Policy
  • Grievance Policy
  • How to Pay
  • E-Waste Policy
  • Trust & Safety
  • Global Anti-Corruption Policy

Certification

Sisa Logoexternal link icon

See All Apps

Download PhonePe App Button Icon
LinkedIn Logo
Twitter Logo
Fb Logo
YT Logo
© 2024, All rights reserved
PhonePe Logo

Business Solutions

arrow icon
  • Payment Gateway
  • Guardian by PhonePe
  • Express Checkout
  • PhonePe Switch
  • Offline Merchant
  • Advertise on PhonePe
  • SmartSpeaker
  • Phonepe Lending
  • POS Machine

Insurance

arrow icon
  • Motor Insurance
  • Bike Insurance
  • Car Insurance
  • Health Insurance
  • Arogya Sanjeevani Policy
  • Life Insurance
  • Term Life Insurance
  • Personal Accident Insurance
  • Travel Insurance
  • Domestic Travel Insurance
  • International Travel Insurance

Investments

arrow icon
  • 24K Gold
  • Liquid Funds
  • Tax Saving Funds
  • Equity Funds
  • Debt Funds
  • Hybrid Funds

General

arrow icon
  • About Us
  • Careers
  • Contact Us
  • Press
  • Ethics
  • Report Vulnerability
  • Merchant Partners
  • Blog
  • Tech Blog
  • PhonePe Pulse

Legal

arrow icon
  • Terms & Conditions
  • Privacy Policy
  • Grievance Policy
  • How to Pay
  • E-Waste Policy
  • Trust & Safety
  • Global Anti-Corruption Policy

Certification

Sisa Logo

See All Apps

Download PhonePe App Button Icon
LinkedIn Logo
Twitter Logo
Fb Logo
YT Logo
© 2024, All rights reserved