ఈ డాక్యుమెంట్, ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000’ నిబంధనల ప్రకారం రూపొందించిబడిన ఎలక్ట్రానిక్ ఒప్పందం. ఈ చట్టానికి కాలానుగుణంగా చేసిన సవరణలు, ఇతర వర్తించే నియమాలను ఈ డాక్యుమెంట్ పాటిస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 సవరణలను అనుసరించి వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు చేసిన మార్పులను కూడా పాటిస్తుంది. దీన్ని PhonePe వినియోగ నియమాలు(“ToU”)తో కలిపి చదవాలి.
పరిచయం
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రూపొందించిన పేమెంట్ ప్లాట్‌ఫామ్. ఏవైనా రెండు పార్టీలకు చెందిన బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ ఆన్‌లైన్ పేమెంట్లకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ ఆన్‌లైన్ పేమెంట్లను సులభతరం చేయడానికి UPI, ఒక ఆర్కిటెక్చర్‌ను, ఒక ప్రామాణిక API స్పెసిఫికేషన్స్ సెట్‌ను అందిస్తోంది. ఇంటర్‌ఆపరబిలిటీని, అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని రూపొందించడంతో పాటు NPCI సిస్టమ్స్ అన్నింటిలోనూ సులభమైన, ఒకే రకమైన ఇంటర్‌ఫేస్‌ను అందించడం దీని లక్ష్యం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (“NPCI”) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (“UPI”), పేమెంట్ సేవ ప్లాట్‌ఫామ్ (“ప్లాట్‌ఫామ్”) ద్వారా చేసే పేమెంట్లను ఈ నియమాలు, షరతులు నియంత్రిస్తాయి. NPCI, 2008లో స్థాపితమైంది. తన సభ్యులకు సముచిత సేవలు అందించడం దీని లక్ష్యం. UPI సేవలకు సంబంధించిన సెటిల్‌మెంట్/క్లియరింగ్ హౌస్/రెగ్యులేటరీ ఏజెన్సీగా ఇది పని చేస్తుంది. ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను(“PhonePe యాప్”) PhonePe ప్రైవేట్ లిమిటెడ్ (“PhonePe”) అందిస్తోంది. ఇది కంపెనీల చట్టం, 1956 కింద ఏర్పాటైంది. దీని రిజిస్టర్డ్ అడ్రస్: ఆఫీస్-2, 4,5,6,7 వ అంతస్తులు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లే అవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక- 560103, ఇండియా. ఇది నోటిఫై చేయబడిన పేమెంట్ సేవా సంస్థ బ్యాంకులు (“PSP”) కింద రిజిస్టర్ అయింది. ఇక్కడ నుంచి “PhonePe”గా వ్యవహరించబడుతుంది. UPI సేవలు (“సేవలు”) “PhonePe” బ్రాండ్ పేరుతో అందించబడతాయి.
PhonePe ప్రైవేట్ లిమిటెడ్ (“PhonePe”) అనేది NPCI ఆథరైజ్ చేసిన ఒక TPAP. PSP బ్యాంకుల ద్వారా పేమెంట్లకు సౌకర్యం కల్పించడం దీని లక్ష్యం. ఈ PSP బ్యాంకుల్లో యెస్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. UPI చెల్లింపు ఎకోసిస్టమ్‌లో PhonePe ఒక సర్వీస్ ప్రొవైడర్. మేము PSP బ్యాంకుల ద్వారా UPIలో పాలు పంచుకుంటాము.
నిర్వచనాలు
“NPCI” – NPCI అనేది RBI ఆథరైజ్ చేసిన ఒక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్. UPI పేమెంట్ సిస్టమ్ ఓనర్ NPCI. అలాగే దీన్ని ఆపరేట్ కూడా చేస్తోంది.
“UPI” – దీన్ని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ అని పిలుస్తారు. సంబంధిత ఆదేశాలు, నోటిఫికేషన్‌ల ప్రకారం NPCI ఇచ్చిన నిర్వచనం ఇది.
“PSP బ్యాంక్” – PSP అనేది బ్యాంకింగ్ కంపెనీ. UPI ఫ్రేమ్‌వర్క్ ప్రకారం పేమెంట్ సేవా సంస్థ (PSP)గా పని చేసే అధికారం దీనికి ఉంటుంది. ఎండ్-యూజర్ కస్టమర్లకు UPI సేవలను అందించడానికి PSP, TPAP సేవలను వినియోగించుకుంటుంది.
“TPAP” – థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP). ఇది UPI ఆధారిత పేమెంట్ లావాదేవీలను సులభతరం చేయడానికి ఎండ్-యూజర్ కస్టమర్లకు UPI అనుకూల యాప్(ల)ను అందించే ఒక సంస్థ.
“కస్టమర్స్ బ్యాంక్” – ఈ బ్యాంకులో ఎండ్-యూజర్ తన ఖాతాను మెయింటైన్ చేస్తారు. అతను/ఆమె, తమ ఖాతాను ఉపయోగించి UPI ద్వారా చేసిన పేమెంట్ లావాదేవీలను డెబిట్ చేయడానికి/క్రెడిట్ చేయడానికి ఈ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను ఉపయోగిస్తారు.
“మీరు”, “మీది”, “మీరే”, “ఎండ్ యూజర్ కస్టమర్”, “యూజర్”– పేమెంట్లను చేయడానికి, స్వీకరించడానికి తమ బ్యాంక్ ఖాతా(ల)ను లింక్ చేసి UPI పేమెంట్ సౌకర్యాన్ని ఉపయోగించే వ్యక్తి.
“మేము”, “మా”, “మనమే”, “PhonePe”– PhonePe ప్రైవేట్ లిమిటెడ్‌ను సూచిస్తుంది.
“PhonePe యాప్” – ఇవి మొబైల్ అప్లికేషన్(లు). దీన్ని PhonePe, PhonePe ఎంటిటీలు హోస్ట్ చేస్తున్నాయి. మర్చెంట్‌లు, సేవా సంస్థలతో సహా తన వినియోగదారులకు PhonePe సేవలను ఈ యాప్ అందిస్తోంది.
‘PhonePe ప్లాట్‌ఫామ్” – PhonePe ప్రైవేట్ లిమిటెడ్ లేదా ఏదైనా ఇతర PhonePe ఎంటిటీల యాజమాన్యంలో ఉన్న/అవి సభ్యత్వం పొందిన/అవి ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫామ్‌ను ఇది సూచిస్తుంది. ఈ ఎంటిటీల కిందకు వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లు, పరికరాలు, URLలు/లింక్‌లు, నోటిఫికేషన్‌లు, చాట్‌బాట్‌లు కూడా వస్తాయి. అలాగే తన సేవలను వినియోగదారులకు అందించేందుకు PhonePe ఎంటిటీలు ఉపయోగించే ఏదైనా ఇతర కమ్యూనికేషన్ మాధ్యమం కూడా వస్తుంది.
“PhonePe సేవలు” – PhonePe, దాంతో పాటు PhonePe ఎంటిటీలు ఒక గ్రూప్‌గా అందిస్తున్న / అందించబోయే అన్ని సేవలు వీటి కిందకు వస్తాయి. వీటిలో ప్రీ-పెయిడ్ పరికరాలు, గిఫ్ట్ కార్డ్‌లు, పేమెంట్ గేట్‌వే, రీఛార్జ్‌లు, బిల్లు పేమెంట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్లు, బంగారం విక్రయం & కొనుగోలు, స్విఛ్‌తో పాటు ఇతర అంశాలు కూడా వస్తాయి.
“బ్యాంక్ ఖాతా / పేమెంట్ ఖాతా”– ఒక నియంత్రిత సంస్థ ద్వారా అందిస్తున్న ఏదైనా బ్యాంక్ ఖాతా లేదా ఏదైనా ఇతర పేమెంట్ ఖాతాలు దీని కిందకు వస్తాయి. వీటిలో డబ్బు దాచుకోవచ్చు, డెబిట్, క్రెడిట్ చేయవచ్చు.
“VPA” – దీని అర్థం యూనిక్ వర్చువల్ పేమెంట్ ఖాతా. ఇది NPCI వద్ద రిజిస్టర్ అయింది, దీనిని మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవచ్చు.
“UPI పిన్”– దీని అర్థం UPI వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. కస్టమర్ ఖాతా నుండి నగదును డెబిట్ చేసేందుకు వీలుగా బ్యాంక్ జారీ చేసే అంగీకార యోగ్యతలను UPI పిన్ అని అంటారు. ఇందులో 4-6 అంకెలు మాత్రమే ఉంటాయి.
రిజిస్ట్రేషన్
PhonePe యాప్ ద్వారా PhonePe UPI అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని PhonePe ఖాతా కలిగిన వినియోగదారులకు PhonePe UPI సేవ అందుతుంది. UPI అనేది అర్హత పొందిన PhonePe సేవ. PhonePe UPIలో రిజిస్టర్ చేసుకోడానికి, దాన్ని యాక్సెస్ చేయడానికి మీ వద్ద యాక్టివ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి మీ సొంత బ్యాంక్ ఖాతాను లింక్ చేసి ఉండాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది, NPCI నిర్వచించి, నిర్వహిస్తున్న UPI మార్గదర్శకాల ప్రకారం ఒక ప్రామాణిక ప్రక్రియ. ఈ మార్గదర్శకాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంది. NPCI, కాలానుగుణంగా చేసే మార్పులను పాటిస్తూ.. ఈ ప్రాసెస్‌ను అమలు చేయడానికి PhonePe, TPAP సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా UPI ప్లాట్‌ఫామ్‌లో మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసేందుకు, ధృవీకరించేందుకు, రిజిస్టర్ చేసేందుకు, లింక్ చేసేందుకు, యూనిక్ వర్చువల్ అకౌంట్ నంబర్‌ను (“VPA”) సృష్టించేందుకు వీలుగా మీ ఫోన్ నుంచి యూనిక్ SMSను పంపించడానికి మీ మొబైల్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని మీరు అర్థం చేసుకుంటున్నారు.
మీ VPAకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను PhonePe స్టోర్ చేయదు. ఇంకా, VPAను ఈ కింద పేర్కొన్న్ అంశాలకు ఉపయోగించవచ్చు:
- మీ PhonePe యాప్‌లో QR కోడ్‌ను ఉపయోగించి మర్చెంట్ లొకేషన్‌లలో చెల్లించవచ్చు.
- నిర్దిష్ట మర్చెంట్ వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
- రెగ్యులేటర్లు, పేమెంట్ సిస్టమ్ సేవా సంస్థలు అనుమతించిన మేరకు PhonePe సేవలకు పేమెంట్ చేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
UPI రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా మీరు ఇచ్చిన వివరాలలో మీ బ్యాంకింగ్ సమాచారం కూడా ఉంటుంది. ఆ వివరాలను PSP బ్యాంక్, NPCI సెక్యూరిటీ లైబ్రరీతో పంచుకుంటాము. ఈ సంస్థలే ఆ వివరాలను నిర్వహిస్తాయి. మీరు ఇచ్చే సమాచారాన్ని PSP బ్యాంక్, NPCIలు నిర్వహించేందుకు, వాటికి పంచుకునేందుకు మీరు సమ్మతి ఇస్తూ ధృవీకరిస్తున్నారు.
లావాదేవీలు
ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి డబ్బును బదిలీ చేయడానికి లేదా ఏదైనా మర్చెంట్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేయడానికి PhonePe UPIని ఉపయోగించవచ్చు. ప్రతి PhonePe UPI పేమెంట్‌ను అంగీకరించడానికి మీ UPI పిన్ ను మీ మొబైల్‌లో ప్రవేశపెట్టాలి. ఏదైనా లావాదేవీ చేసే సమయంలో మీ ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేశారని నిర్ధారించుకోవాలి. అయితే, ఈ సౌకర్యాన్ని అన్ని లావాదేవీలకు PhonePe లేదా PhonePe సంస్థలు అందించకపోవచ్చు.
PhonePe ప్లాట్‌ఫామ్‌లో PhonePe సేవల కోసం పేమెంట్లు చేస్తున్నప్పుడు, PhonePe UPIని ఉపయోగించి మీరు పేమెంట్లు చేయవచ్చు.
PhonePe UPI అనేది వివిధ మర్చెంట్ ప్లాట్‌ఫామ్‌లలో మీకు అందుబాటులో ఉన్న పలు రకాల పేమెంట్ ఎంపికలలో ఒకటి. PhonePe UPIని ఉపయోగించి కొనుగోలు చేసిన ఉత్పత్తులకు / సేవలకు మేము ఎటువంటి బాధ్యత వహించము. వాటికి సంబంధించిన ఎలాంటి బాధ్యతను అయినా తీసుకోవడాన్ని మేము స్పష్టంగా నిరాకరిస్తున్నాము.
PhonePe వినియోగదారు, జారీ చేసే బ్యాంక్, పేమెంట్ లో పాలుపంచుకునే వాళ్లు లేదా వర్తించే చట్టంలోని నిబంధనల ప్రకారం UPI లావాదేవీలు, నిర్దేశించిన కనిష్ఠ, గరిష్ఠ లావాదేవీ పరిమితులకు లోబడి ఉంటాయి. ఇంకా PhonePe, Bank – PSP లేదా పేమెంట్లో పాలుపంచుకునే ఇతరులు తమ సంబంధిత విధానాలు, అసెస్‌మెంట్ ఆధారంగా లావాదేవీలను (పూర్తిగా లేదా పాక్షికంగా) తిరస్కరించవచ్చు/నిలిపివేయవచ్చు.
మీ లావాదేవీ రికార్డులను PhonePe యాప్ – “History/చరిత్ర” విభాగంలో సమీక్షించవచ్చు. మీరు లావాదేవీలు అన్నింటినీ సమీక్షించవలసి ఉంటుంది. లావాదేవీలో ఏదైనా లోపాన్ని లేదా అనధికారిక లావాదేవీని గుర్తించినట్లయితే, నోటిఫై చేసిన వివాద పరిష్కార విధానం ప్రకారం దీన్ని తెలియజేయాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.
- ఛార్జీలు:
PhonePe ఖాతాను రూపొందించడానికి వినియోగదారులు ఎటువంటి ఫీజును చెల్లించక్కర్లేదు. అయితే, వర్తించే చట్టాలకు లోబడి ఎప్పటికప్పుడు ఫీజు విధానాన్ని మార్చే హక్కు మాకు ఉంటుంది. మేము ఏదైనా కొత్త సేవలకు ఫీజు వసూలు చేయడాన్ని ప్రారంభించవచ్చు లేదా ఇప్పటికే ఉన్న సేవలకు ఫీజులను సవరించవచ్చు/ప్రవేశపెట్టవచ్చు. ఫీజు(ల)లో మార్పులను వెబ్‌సైట్/యాప్ ద్వారా మీకు తెలియజేస్తాము. అలాంటి మార్పులు అన్నీ వాటిని పోస్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తాయి. UPI ఇంటర్నేషనల్ విషయంలో, ప్రత్యేకంగా ప్రస్తావించినప్పుడు తప్ప, మిగిలిన అన్ని సందర్భాలలో ఫీజులను భారతీయ రూపాయిలలోనే కోట్ చేస్తాము.
UPI బదిలీల కోసం మీ బ్యాంక్ నామమాత్రపు లావాదేవీ ఫీజును వసూలు చేయవచ్చు- అలాంటి ఛార్జీల గురించిన సమాచారం కోసం దయచేసి మీ బ్యాంక్‌ను సంప్రదించండి. - లావాదేవీ పర్యవేక్షణ:
రిస్క్ ఎక్కువగా ఉన్న లావాదేవీలను గుర్తించడం కోసం PhonePe, PhonePe ఎంటిటీలలో మీ కార్యకలాపాన్ని, లావాదేవీలను PhonePe సమీక్షించవచ్చు. ఈ అంశంలో మాకు సహాయం చేయడానికి మేము థర్డ్ పార్టీ ప్రొవైడర్‌లను కూడా ఎంగేజ్ చేయవచ్చు. ఒకవేళ, మీరు ప్రాసెస్ చేసిన లావాదేవీలు లేదా ఏదైనా సేవా సంస్థలను ఇతర యాక్టివిటీ అనుమానాస్పదంగా లేదా అసాధారణంగా ఉందని మేము భావిస్తే, మీరు, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా PhonePe UPI సర్వీసులను యాక్సెస్ చేయకుండా నిలిపివేస్తాము.
రిస్క్ మేనేజ్‌మెంట్, మోసపూరితమైన చర్య, చట్టవిరుద్ధమైన లావాదేవీలు జరిగాయని అనుమానించడం, నిషేధిత వస్తువుల కొనుగోలు/అమ్మకం, దొంగతనానికి గురైన లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కార్డ్‌లు లేదా UPI ఖాతాల వాడకం, ఛార్జ్‌బ్యాక్స్/ఫిర్యాదులు లేదా పేమెంట్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలలో సూచించిన ఇతర కారణాల వల్ల, ఇంకా ఇతరత్రా ఇలాంటి అంశాల వల్ల మీ లావాదేవీని తిరస్కరించబడవచ్చు. మేము మరింత లోతుగా దర్యాప్తు చేయవచ్చు. మీ PhonePe ఖాతాను సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. చట్టం నోటిఫై చేసిన ప్రకారం లేదా అది వర్తించే మేరకు అనుమానాస్పద లావాదేవీని, మీ ఖాతా వివరాలను చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు లేదా ఇతర నియంత్రణ అధికారులకు నివేదించవచ్చు. - ఒకటికి పైగా VPA(లు) మరియు బ్యాంక్ ఖాతా(లు):
PhonePe UPI వద్ద రిజిస్టర్ అయిన యూజర్‌గా PhonePe యాప్‌లో మీకు పలు బ్యాంక్ ఖాతా(ల)ను లింక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఇంకా అటువంటి ప్రతి బ్యాంక్ ఖాతాకు VPA(లు) ఎనేబుల్ చేయడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. PhonePe యాప్‌లో ఇప్పటికే ఎనేబుల్ చేసిన VPAను మీరు గతంలో లింక్ చేసిన మరో బ్యాంక్ ఖాతాతో తిరిగి లింక్ చేసుకునే అవకాశం ఉండవచ్చు. అలాంటి సందర్భంలో, PhonePe యాప్ నుండి మీకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా, PhonePe యాప్‌లో మీరు లింక్ చేసినటువంటి ఒక్కొక్క బ్యాంక్ ఖాతాకు ఒక్కొక్క ప్రత్యేక VPAను కేటాయించే ప్రత్యేక హక్కు PhonePeకు ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు. అటువంటి మార్పు చేసిన తర్వాత, PhonePe యాప్‌లోని మీ ఖాతా యొక్క ప్రొఫైల్ సెక్షన్ కింద మీరు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా(లు) అన్నింటికి సంబంధించిన, ప్రతీ VPA(ల) ప్రత్యేక వివరాలను మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు.
వినియోగదారు బాధ్యత & తప్పక పాటించాల్సిన విషయాలు
PhonePe UPIలో మీరు రిజిస్టర్ చేసుకుని, దాన్ని ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నప్పుడు, మీరు ఈ కింద పేర్కొన్న విషయాలను నిర్ధారించుకోవాలి –
- సరైన బ్యాంక్ ఖాతాను లింక్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా మీదే.
- మీ మొబైల్ నంబర్‌ను ప్రధాన గుర్తింపు సాధనంగా పరిగణిస్తున్న కారణంగా, ఏవైనా మార్పులు జరిగినప్పుడు, PhonePe యాప్‌కు లింక్ అయిన బ్యాంక్‌లో మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలి.
- మీ PhonePe ఖాతాతో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌ను మార్చినట్లయితే, PhonePeలో మీ కొత్త మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. సేవను మళ్లీ ఎనేబుల్ చేయడానికి, మీ బ్యాంక్‌లో కూడా మీ కొత్త మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి.
- మీ OTP, UPI PIN, బ్యాంక్ ఖాతా సంబంధిత వివరాలను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత పూర్తిగా మీదే. అటువంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం అన్నది అనధికార వినియోగానికి దారి తీయొచ్చు. దీనికి PhonePe బాధ్యత వహించదు.
- PhonePe UPI ద్వారా మీరు అంగీకరించి, జరిపే పేమెంట్ అభ్యర్థనకు మీరే పూర్తిగా బాధ్యత వహించాలి. లబ్ధిదారుని చేర్చడం, VPAలను టైప్ చేయడం, సమీక్షించడం, ఉద్దేశించిన గ్రహీతలను ధృవీకరించడం వంటి వాటికి మీదే బాధ్యత. పేమెంట్ ను ప్రాసెస్ చేసేటప్పుడు మీరు నమోదు చేసే సమాచారం ఖచ్చితత్వాన్ని మేము ధృవీకరించము. ఆథరైజ్ కూడా చేయము.
- మీరు అసత్యమైన, తప్పుడు వివరాలున్న, అసంపూర్ణమైన లేదా ప్రస్తుతానికి సంబంధించనది కాని లేదా అసంపూర్ణమైన ఏదైనా సమాచారాన్ని అందించినట్లయితే లేదా అటువంటి సమాచారం అసత్యమైనదని, తప్పు అని, ప్రస్తుతానికి సంబంధించనది కాదు అని లేదా అసంపూర్ణమైనది అని లేదా దీని వినియోగ నియమాలకు అనుగుణంగా లేదని అనుమానించడానికి మా వద్ద సహేతుకమైన ఆధారాలు ఉంటే, మీ ఖాతా యాక్సెస్‌ను నిరవధికంగా నిలిపివేయడానికి లేదా మూసివేయడానికి లేదా బ్లాక్ చేయడానికి మాకు హక్కు ఉంటుంది.
- మీ లావాదేవీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర గోప్యమైన వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన మీ రహస్య డేటా అంతటినీ అందుబాటులో ఉన్న ఉత్తమ రక్షణ ప్రమాణాలను ఉపయోగించి రక్షిస్తాము, గోప్యంగా ఉంచుతాము. ఆ రక్షణ ప్రమాణాలను మరింత స్పష్టంగా మా గోప్యతా విధానంలో సంపూర్ణంగా పేర్కొన్నాము.
- మీరు ఫండ్ బదిలీ చేస్తున్నప్పుడు ఏదైనా దోషం తలెత్తితే, ఆ ఫండ్ బదిలీ జాప్యానికి లేదా తలెత్తిన నష్టానికి PhonePe UPI, PSP లేదా UPI పేమెంట్ సిస్టమ్‌లో పాలుపంచుకునే ఏదైనా ఇతర సిస్టమ్‌లు బాధ్యత వహించవని మీరు అంగీకరిస్తున్నారు.
- మీకు జారీ చేసిన బ్యాంక్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు లావాదేవీ తిరస్కారానికి గురి కాకుండా, ఛార్జీలు పడకుండా ఉండేందుకు, PhonePe UPIతో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా(ల)లో తగినన్ని నిధులు ఉండేలా మీరు నిర్ధారించుకోవాలి.
- మీరు ఇచ్చిన ‘UPI నంబర్’ (ఆటోమేటిక్‌గా మీ మొబైల్ నంబర్ అవుతుంది) ఉపయోగించి నిధులను పంపడానికి లేదా స్వీకరించడానికి మీకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా ‘న్యూమరిక్ UPI ID మ్యాపర్‘ వంటి NPCI నిర్వహించే సెంట్రలైజ్డ్ మ్యాపర్(ల)లో ‘PhonePe’ మిమ్మల్ని ఆన్‌బోర్డ్ చేస్తుందని అర్థం చేసుకుని మీరు అంగీకరిస్తున్నారు. ఇందుకోసం NPCI నిర్వచించి, అనుమతించిన మేరకు మీరు సమ్మతిస్తూ అంగీకారం తెలుపుతున్నారు. ఈ ప్రక్రియ NPCI ఆదేశాల ప్రకారం జరుగుతుంది. NPCIతో మీ UPI వివరాలను (UPI సేవలను అందించడానికి PhonePe వీటిని సేకరించి నిర్వహిస్తుంది) పంచుకోవడానికి, మీ ‘UPI నంబర్’కు ఆటోమేటిక్ బ్యాంక్ ఖాతా / VPAను లింక్ చేయడానికి మాత్రమే ఈ ప్రక్రియ పరిమితం కాదు. ఇది మీ UPI నంబర్‌తో పేమెంట్లను అంగీకరించడానికి మీకు అనుమతిని ఇస్తుంది. PhonePe మొబైల్ అప్లికేషన్‌లో ప్రాసెస్ అయిన UPI నంబర్ ఆటోమేటిక్ మ్యాపింగ్‌ను డీ-లింక్ చేయడానికి PhonePe మీకు ఒక ఎంపికను అందిస్తుంది. PhonePeలో రిజిస్టర్ చేసుకున్న ఇతర యూజర్‌ల నుండి నిధులను స్వీకరించడానికి కూడా మీరు అంగీకారం తెలుపుతున్నారు. అటువంటి లావాదేవీలను మీరు లింక్ చేసిన ఆటోమేటిక్ బ్యాంక్ ఖాతాకు ప్రాసెస్ చేస్తుందని, NPCI మ్యాపర్‌లో చెక్ చేయకుండానే PhonePe ఈ ప్రక్రియను పూర్తి చేస్తుందని మీరు అంగీకరిస్తున్నారు.
UPIలో పాలుపంచుకునే వారి విధులు, బాధ్యతలు
- NPCI:
- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫామ్ NPCI సొంతం. నిర్వహణ కూడా NPCIనే చేస్తుంది.
- UPIకి సంబంధించిన నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు, పాలుపంచుకునే వారి విధులను, బాధ్యతలను, జాగ్రత్తలను NPCI నిర్దేశిస్తుంది. ఇందులో లావాదేవీల ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్, వివాద నిర్వహణ, సెటిల్‌మెంట్ చేసే కట్-ఆఫ్‌లను క్లియర్ చేయడం వంటివి కూడా ఉంటాయి.
- UPIలో జారీ చేసిన బ్యాంక్‌లు, PSP బ్యాంక్‌లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (TPAP), ప్రీపెయిడ్ పేమెంట్ పరికరాలను జారీ చేసే సంస్థల (PPIలు) పాలు పంచుకోవడాన్ని NPCI ఆమోదిస్తుంది.
- NPCI సురక్షితమైన, భద్రతతో కూడిన, సమర్థవంతమైన UPI సిస్టమ్, నెట్‌వర్క్‌ను అందిస్తుంది.
- UPIలో పార్టిసిపేట్ చేసే సభ్యులకు ఆన్‌లైన్ లావాదేవీల రూటింగ్, ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్ సేవలను NPCI అందిస్తుంది.
- NPCI తనంతట తాను నేరుగా లేదా థర్డ్ పార్టీ ద్వారా UPI పార్టిసిపేట్ చేసే వారిపై ఆడిట్ నిర్వహించగలదు. UPIలో వారి పార్టిసిపేషన్‌కు సంబంధించిన డేటాను, సమాచారాన్ని, రికార్డులను సమర్పించాలని కోరవచ్చు.
- UPIలో పాలుపంచుకునే బ్యాంకులకు సిస్టమ్‌ను యాక్సెస్ చేసే అవకాశాన్ని NPCI అందిస్తుంది. ఈ సిస్టమ్ నుంచి ఆ బ్యాంకులు తమ నివేదికలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఛార్జ్‌బ్యాక్‌లను రెయిజ్ చేయవచ్చు, UPI లావాదేవీల స్టేటస్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
- PSP బ్యాంక్
- UPIలో PSP బ్యాంక్‌కు సభ్యత్వం ఉంటుంది. UPI పేమెంట్ సదుపాయాన్ని పొందడం కోసం UPI ప్లాట్‌ఫామ్‌కు PSP బ్యాంక్, కనెక్ట్ అవుతుంది. అదే సదుపాయాన్ని TPAPకి కూడా అందిస్తుంది. దీంతో చివరి-యూజర్ కస్టమర్‌లు / మర్చెంట్‌లు, UPI పేమెంట్లు చేయడానికి, పొందడానికి వీలు అవుతుంది.
- PSP బ్యాంక్, దాని సొంత యాప్ ద్వారా లేదా TPAP యాప్ ద్వారా, UPIలోకి ఎండ్-యూజర్ కస్టమర్‌లను ఆన్-బోర్డ్ చేసి రిజిస్టర్ చేస్తుంది. వారి బ్యాంక్ ఖాతాలను వారి సంబంధిత UPI IDతో లింక్ చేస్తుంది.
- చివరి-యూజర్ కస్టమర్‌ను రిజిస్టర్ చేసే సమయంలోనే ఆ కస్టమర్ ఆథంటికేషన్‌కు PSP బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. ఈ ఆథంటికేషన్ ప్రక్రియను సొంత యాప్ ద్వారా లేదా TPAP యాప్ ద్వారా PSP బ్యాంక్ పూర్తి చేస్తుంది.
- TPAP UPI యాప్‌ను ఎండ్-యూజర్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంచడానికి PSP బ్యాంక్ TPAPలను ఎంగేజ్ చేసి, ఆన్-బోర్డ్ చేస్తుంది.
- TPAP, అలాగే దాని సిస్టమ్‌లు UPI ప్లాట్‌ఫామ్‌లో పని చేయడానికి అవసరమైనంత సురక్షితంగా ఉన్నాయని PSP బ్యాంక్ నిర్ధారించుకోవాలి.
- UPI లావాదేవీ డేటా, UPI యాప్ సెక్యూరిటీతో సహా ఎండ్-యూజర్ డేటాను, సమాచార భద్రతను, సమగ్రతను కాపాడేందుకు UPI యాప్‌ను, TPAP సిస్టమ్‌లను ఆడిట్ చేస్తున్నట్లుగా నిర్ధారించాల్సిన బాధ్యత PSP బ్యాంక్ మీద ఉంటుంది.
- UPI లావాదేవీలను సులభతరం చేయడం కోసం సేకరించిన UPI లావాదేవీ డేటాతో సహా మొత్తం పేమెంట్ల డేటాను భారతదేశంలో మాత్రమే PSP బ్యాంక్ నిల్వ చేయాలి.
- కస్టమర్ UPI ఐడితో లింక్ చేసేందుకు UPI ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న బ్యాంకుల జాబితా నుండి ఏ బ్యాంక్ ఖాతాను అయినా ఎంచుకోవడానికి UPI కస్టమర్లు అందరికీ ఒక ఎంపికను అందించాల్సిన బాధ్యత PSP బ్యాంక్ మీద ఉంటుంది.
- చివరి-యూజర్ కస్టమర్ లేవనెత్తిన ఫిర్యాదులను, వివాదాలను పరిష్కరించడానికి వీలుగా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే బాధ్యత PSP బ్యాంక్ మీద ఉంటుంది.
- PhonePe (TPAP)
- PhonePe ఒక సేవా సంస్థ. ఇది PSP బ్యాంక్ ద్వారా UPIలో పాలుపంచుకుంటుంది.
- UPIలో TPAP పాలుపంచుకోవడానికి సంబంధించి PSP బ్యాంక్‌తోపాటు NPCI నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా PhonePe బాధ్యత తీసుకుంటుంది.
- UPI ప్లాట్‌ఫామ్‌లో పనిచేయడానికి అవసరమైనంత సురక్షితంగా PhonePe సిస్టమ్‌లు ఉన్నాయని నిర్ధారించాల్సిన బాధ్యత PhonePeకు ఉంటుంది.
- UPI ప్లాట్‌ఫామ్‌లో UPIకి, PhonePe పాలుపంచుకోవడానికి సంబంధించి ఏదైనా చట్టబద్ధమైన లేదా నియంత్రణ అధికార సంస్థ సూచించిన వర్తించే అన్ని చట్టాలు, నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలు, మొదలైన అంశాలతోపాటు ఈ విషయంలో NPCI జారీ చేసిన అన్ని సర్క్యులర్‌లు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత PhonePe పైన ఉంటుంది.
- UPI లావాదేవీలను సులభతరం చేసే ఉద్దేశ్యంతో TPAP ద్వారా సేకరించిన UPI లావాదేవీ డేటాతో సహా మొత్తం పేమెంట్ల డేటాను భారతదేశంలో మాత్రమే PhonePe నిల్వ చేయాలి.
- RBI, NPCIలతో పాటు RBI/NPCI ద్వారా నామినేట్ అయిన ఇతర ఏజెన్సీలకు, UPIకి సంబంధించిన డేటాను, సమాచారాన్ని, PhonePe సిస్టమ్‌ల యాక్సెస్‌ను ఇవ్వాల్సిన బాధ్యత, అలాగే, RBI, NPCIకి అవసరమైనప్పుడు PhonePeలో ఆడిట్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత కూడా PhonePe పైన ఉంటుంది.
- PhonePe యాప్ లేదా వెబ్‌సైట్, అలాగే PhonePe సముచితమని భావించే ఈమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్, IVR మొదలైన ఇతర ఛానెల్స్‌ను ఉపయోగించి, అందుబాటులో ఉన్న PhonePe ఫిర్యాదుల పరిష్కార సౌకర్యం ద్వారా ఫిర్యాదును పంపించే అవకాశాన్ని ఎండ్-యూజర్ కస్టమర్‌కు కల్పించాల్సిన బాధ్యత PhonePe పైన ఉంటుంది.
UPI ఇంటర్నేషనల్
విదేశాలలో ప్రయాణించే వినియోగదారులు, అవకాశం ఉన్న, ఎంపిక చేసిన దేశాలలోని మర్చెంట్‌లకు పేమెంట్లు చేసేందుకు UPI పేమెంట్ సౌకర్యాన్ని UPI ఇంటర్నేషనల్ ఫీచర్ కల్పిస్తుంది. దీనిలో పేమెంట్ విధానం సాధారణ UPI మర్చెంట్ లావాదేవీల మాదిరిగానే ఉంటుంది. వినియోగదారు QRను (UPI గ్లోబల్ QR, లోకల్ QR, స్టాటిక్ లేదా డైనమిక్ QR, సందర్భాన్ని బట్టి) స్కాన్ చేసి లేదా సేకరణ అభ్యర్థనను పంపించి, మొత్తాన్ని ప్రవేశపెట్టి, UPI పిన్‌తో ఆథరైజ్ చేస్తే సరిపోతుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు UPI పిన్‌తో తమ ఇంటర్నేషనల్ పేమెంట్లను యాక్టివేట్ చేయాలి. ఈ యాక్టివేషన్‌ను ఎక్కడి నుండైనా చేయవచ్చు. అంటే భారతదేశంలో లేదా విదేశాలలో పూర్తి చేయవచ్చు. వినియోగదారులు యాక్టివేషన్ చేయకుండానే ఇంటర్నేషనల్ QRని స్కాన్ చేసినట్లయితే, అప్పుడు ముందుగా UPI ఇంటర్నేషనల్ యాక్టివేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాతనే వారి పేమెంట్ ను పూర్తి చేయడానికి అవకాశం లభిస్తుంది. వినియోగదారు అభ్యర్థన ఆధారంగా, UPI ఇంటర్నేషనల్ లావాదేవీల కోసం వినియోగదారులు ఎంచుకున్న బ్యాంక్ అకౌంట్‌లను PhonePe యాక్టివేట్ చేస్తుంది. UPI ఇంటర్నేషనల్ యాక్టివేట్ అయిన వినియోగదారులు అందరికీ, ఆ యాక్టివేషన్ కాలపరిమితి 3 నెలలు మాత్రమే ఉంటుంది. అంటే, 3 నెలల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా యాక్టివేషన్ ఆగిపోతుంది. అయితే, యూజర్‌లు UPI పిన్ ఆథరైజేషన్ ప్రక్రియ ద్వారా 3 నెలల గడువు ముగియడం కంటే ముందే PhonePe యాప్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లి ఈ ఫీచర్‌ను డీయాక్టివేట్ చేయవచ్చు.
UPI ఇంటర్నేషనల్ లావాదేవీలు అన్నింటికీ, లావాదేవీ జరుగుతున్న దేశంలోని లోకల్ కరెన్సీలో మొత్తం నమోదు అవుతుంది. రియల్‌టైమ్‌లోని ఫారెక్స్ రేట్లు & మార్కప్ ఆధారంగా అదే మొత్తం భారతీయ రూపాయలలో కూడా కనిపిస్తుంది. లావాదేవీ చరిత్రలో ప్రతి లావాదేవీకి సంబంధించిన పేమెంట్ వివరాలలో UPI ఇంటర్నేషనల్ పేమెంట్స్ గుర్తింపు సాధనం ఉంటుంది. మీ బ్యాంక్ విధించే ఏదైనా ప్రాసెసింగ్ ఫీజుతో సహా UPI ఇంటర్నేషనల్ లావాదేవీలకు వర్తించే ఛార్జీలు అన్నీ భరించేందుకు మీరు సమ్మతం తెలుపుతున్నారు. లావాదేవీ సమయంలో ఉన్న కరెన్సీ రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగా లావాదేవీని ప్రారంభించినప్పుడు కనిపించే ఛార్జీలకు లావాదేవీ పూర్తయిన సమయానికి ఉండే ఛార్జీలకు తేడా ఉంవచ్చు. డైనమిక్ ఛార్జీలు విధించబడే అవకాశం ఉందని మీరు అర్థం చేసుకుని, అంగీకారం తెలుపుతున్నారు.
NRE/NRO లింక్ చేసిన UPI
భారతదేశంలోని బ్యాంకులలో ఉన్న నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE)/ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (NRO) బ్యాంక్ ఖాతాలతో లింక్ చేసిన భారతీయేతర మొబైల్ నంబర్లతో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ప్రవాస భారతీయ, అంటే నాన్‌రెసిడెంట్ ఇండియన్ (NRI) వినియోగదారులు PhonePe యాప్/PhonePe ప్లాట్‌ఫారంను ఉపయోగించవచ్చు/యాక్సెస్ చేసుకోవచ్చు. . NRI వినియోగదారులు తమ భారతీయ NRE/NRO ఖాతాలు భారతదేశంలోని వర్తించే చట్టాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకుని, వారి KYCని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. NRI వినియోగదారుల వ్యక్తిగత, పేమెంట్ డేటాతో సహా మొత్తం డేటా/సమాచారం భారతదేశంలోని వర్తించే చట్టాలకు అనుగుణంగా నిల్వ చేయబడుతుంది. అలాగే యాక్సెస్ చేయబడి, ప్రాసెస్ చేయబడుతుంది.
UPI Lite
ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (“RBI”) మరియు/లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (“NPCI”) జారీ చేసిన వర్తించే మార్గదర్శకాలకు లోబడి, మీ PhonePe యాప్‌లో ‘UPI Lite’ను పొందే అవకాశాన్ని మేము కల్పించవచ్చు. UPI Lite అనేది తక్కువ మొత్తంతో చేసే లావాదేవీల కోసం NPCI ప్రారంభించిన ‘ఆన్-డివైస్ వాలెట్’. అన్ని బ్యాంకులు UPI Liteను ప్రారంభించకపోవచ్చు/సహకారం అందించకపోవచ్చు. మీరు UPI Lite కావాలనుకుంటే మీ PhonePe యాప్‌లో లింక్ చేసిన ఒక బ్యాంక్ ఖాతాకు మాత్రమే ఎనేబుల్ చేయగలరు (ఇకపై దీన్ని “UPI Lite ఫెసిలిటీ” అని వ్యవహరించడం జరుగుతుంది).
UPI లైట్ ఫెసిలిటీని ఎనేబుల్ చేయడానికి, PhonePe యాప్‌లోని నిర్దిష్ట విభాగంలో మీరు క్లిక్/ట్యాప్ చేయాలి. తర్వాత UPI Lite సౌకర్యానికి నిధులను జోడించాలి. PhonePe యాప్‌లోని నిర్దిష్ట విభాగంలో క్లిక్ చేయడం/ట్యాప్ చేయడం ద్వారా, UPI Lite సౌకర్యాన్ని ప్రారంభించడానికి మీరు అనుమతిని ఇస్తారు. మీ UPI పిన్ ను ఉపయోగించి PhonePe యాప్‌లో UPI Liteకు లింక్ చేసిన మీ బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే నిధులు చేరుతాయి. మీరు PhonePe యాప్‌లో UPI Lite సౌకర్యం ద్వారా చేసే ప్రతి లావాదేవీ స్టేటస్‌ను ట్రాక్ చేయగలరు. UPI Liteకు జోడించిన ఏదైనా మొత్తంపై వడ్డీ ఉండదు. UPI Lite సౌకర్యం ద్వారా పేమెంట్ చేయడానికి, మీరు UPI పిన్ ను నమోదు చేయవలసిన అవసరం లేదు. అయితే, UPI Lite సౌకర్యం ద్వారా చేసే లావాదేవీలకు సంబంధించి వర్తించే పరిమితులు ఉంటాయి. వర్తించే లావాదేవీ పరిమితులు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి:
- UPI Lite సౌకర్యాన్ని ఉపయోగించి చేసే ప్రతి లావాదేవీకి గరిష్ఠ పరిమితి 500 రూపాయలను మించకూడదు.
- UPI Lite సౌకర్యాన్ని ఉపయోగించి ఒక రోజులో చేసే అన్ని లావాదేవీల మొత్తం విలువ గరిష్ట పరిమితి 4000 రూపాయలను మించకూడదు.
- పైన పేర్కొన్న లావాదేవీ పరిమితులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే మేము సవరించవచ్చు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు PhonePe యాప్‌లో సూచించిన దశలను/విధానాలను అనుసరిస్తూ UPI Lite సౌకర్యాన్ని నిలిపివేసే హక్కు మీకు ఉంటుంది.
మీరు మొబైల్‌ను మార్చే ముందు, PhonePe యాప్‌లో వివరించినట్లుగా పాత మొబైల్‌లో UPI Liteను తప్పనిసరిగా డిసేబుల్ చేయాలి. అలానే మీ UPI Liteలో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని PhonePeతో లింక్ అయిన మీ బ్యాంక్ అకౌంట్‌కు పంపించాలి. ఒకవేళ మీ పాత మొబైల్‌లో UPI Liteను డిసేబుల్ చేయలేకపోతే, UPI Liteలో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని PhonePeతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు పంపించమని కోరుతూ మీ బ్యాంక్‌ను సంప్రదించవచ్చు. ఈ విషయంలో PhonePe బాధ్యత వహించదు.
UPI Lite సౌకర్యాన్ని నిలిపివేసిన తర్వాత, అందులో ఉన్న బ్యాలెన్స్ మొత్తం, మీరు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
పైన ప్రస్తావించిన నిబంధనలు తప్ప, PhonePe UPIకి సంబంధించిన నిబంధనలు అన్నీ UPI Liteకు కూడా వర్తిస్తాయి. ఈ సెక్షన్ కింద ఉన్న నిబంధనల మధ్య విబేధాలు వచ్చిన సందర్భంలో, అంటే UPI Liteకు, PhonePe UPI వినియోగ నియమాలకు (UPI Lite విభాగం మినహా) మధ్య తేడా వస్తే, ఈ సెక్షన్ కింద ఉన్న నియమాలు అమలు అవుతాయి. UPI Liteను ఉపయోగించి ఆథరైజ్ చేసిన లావాదేవీ(ల)కు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే అవి PhonePe UPIకి వర్తించే ప్రక్రియ ప్రకారమే పరిష్కరమవుతాయి.
UPI- ATM -ఇంటర్-ఆపరేట్ విధానంలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ
ఈ నిబంధనల (“ఫెసిలిటీ”) ఆధారంగా ఎంపిక చేసిన ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్‌ల (“ATM(లు)”) వద్ద కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని ఎంచుకోవడానికి మేము మిమ్మల్ని అనుమతించవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి, మీరు ఈ అర్హతలను కలిగి ఉండాలి: (i) UPI-ATM సౌకర్యం కోసం వీలు కల్పించినటువంటి అర్హత కలిగిన బ్యాంక్ కస్టమర్ అయి ఉండటం, (ii) ఈ సౌకర్యం కోసం వీలు కల్పించిన ATMను ఉపయోగించడం వంటి కొన్ని ప్రమాణాలను మీరు నెరవేర్చవలసి ఉంటుంది. (iii) PhonePe UPIతో రిజిస్టర్ చేసుకోండి (ఈ సౌకర్యం కోసం UPIని పేమెంట్ ఆప్షన్‌గా ఉపయోగించడానికి); మరియు/లేదా NPCI లేదా RBI ద్వారా నిర్వచించిన ఇతర ప్రమాణాలను పాటించడం (సందర్భానుసారం).
పైన పేర్కొన్న ప్రమాణాలను నెరవేర్చి, నగదు ఉపసంహరించుకోవడానికి అర్హత కలిగిన ATM వద్దకు వచ్చిన తర్వాత, ఉపసంహరించుకోవడానికి ATMలో “UPI వగదు ఉపసంహరణ”ను ఎంచుకుని, ఉపసంహరణ మొత్తాన్ని పొందుపరచవచ్చు. అవసరమైన మొత్తాన్ని పొందుపరచిన తర్వాత ATM స్క్రీన్‌పై ఒకసారి మాత్రమే ఉపయోగించగల డైనమిక్ QR కోడ్ కనిపిస్తుంది. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా PhonePe యాప్‌ను ఉపయోగించి QR కోడ్‌ను స్కాన్ చేసి, డబ్బులు ఉపసంహరించుకోవాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి.
పైన పేర్కొన్న వాటిని ఎంచుకున్న తరువాత, మీ PhonePe యాప్‌లోని UPI పిన్ ను ఉపయోగించి PhonePe UPI ద్వారా లావాదేవీని ధృవీకరించమని మీకు ప్రాంప్ట్ వస్తుంది. విజయవంతమైన ధృవీకరణ తరువాత, మీ PhonePe యాప్ ఇంకా ATM మెషీన్‌పై ఒక ధృవీకరణ స్క్రీన్ కనిపిస్తుంది, దీని తరువాత ATM స్క్రీన్‌పై నగదును వసూలు చేసుకోవాలని మీకు ప్రాంప్ట్ వస్తుంది (మీకు డబ్బు జారీ చేసిన బ్యాంక్ ద్వారా బ్యాంక్ ఖాతా నుండి నగదు డెబిట్ అయిన సంగతి గురించి తర్వాత తెలియజేయబడుతుంది). ATM మెషీన్ నుండి డబ్బు వస్తుంది, దాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ డబ్బు మీ బ్యాంకు ఖాతా నుండి డెబిట్ చేయబడి, ఏదైనా కారణం(కారణాల) వల్ల లావాదేవీ విజయవంతం కానట్లయితే, మీ ఖాతా నుండి డెబిట్ చేయబడిన మొత్తాన్ని రివర్స్ చేయడం కోసం మీకు నగదు జారీ చేసిన బ్యాంకును మీరు సంప్రదించవచ్చు. ఈ విషయంలో PhonePe బాధ్యత వహించదు.
ఆ ATM నుండి నగదు బయటకు వచ్చి, దానిని మీరు తీసుకునే వరకు, మీరు ATM మెషీన్ దగ్గర ఉదాసీనంగా ఉండకూడదని దయచేసి గమనించండి. NPCI / RBI, లేదా మీకు నగదు జారీ చేసిన బ్యాంక్ నగదు ఉపసంహరణకు సంబంధించి విధించిన లావాదేవీ పరిమితి(ల)కు మీరు లోబడి ఉంటారు (మీకు ముందస్తు నోటీసు లేకుండా వీటిని ఎప్పటికప్పుడు సవరించవచ్చు). ఈ సౌకర్యం ద్వారా పూర్తయిన లావాదేవీలను మీ PhonePe యాప్‌లోని మీ చరిత్ర విభాగంలో చూసుకోవచ్చు.
మీరు వీటికి అంగీకరిస్తున్నారు: (i) PhonePe తన PhonePe యాప్ ద్వారా మాత్రమే ఈ సౌకర్యాన్ని ఎనేబుల్ చేస్తోంది, ఈ సౌకర్యం కోసం అర్హత కలిగిన ATM మెషీన్‌ల గురించి PhonePeకు విజిబిలిటీ ఉండదు. ఈ సౌకర్యం కోసం ATM మెషీన్ ఎనేబుల్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం అనేది మీ బాధ్యత అవుతుంది; (ii) ధృవీకరణ పొందిన తరువాత (మీ PhonePe యాప్/ ATM మెషీన్ ద్వారా విజయవంతమైన ధృవీకరణ తరువాత) నగదును తీసుకోవడానికి, అలాగే అందుకున్న నోట్లు (i) చెడిపోయినవా, పాడైపోయినవా లేదా నకిలీవా అనే వాటిని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే, (ii) అలాగే మీరు ఉపసంహరించుకోవడానికి ఎంచుకున్న అదే విలువ కలిగిన నోట్లను మీరు అందుకున్నారో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ విషయంలో PhonePe బాధ్యత వహించబోదు.
PHONEPE UPI ద్వారా క్రెడిట్ లైన్
మీ లోన్ జారీ చేసే బ్యాంక్ మీకు క్రెడిట్ లైన్‌ను (“క్రెడిట్ లైన్”) మంజూరు చేసినట్లయితే/పొడిగించినట్లయితే, ఈ నియమాలకు అనుగుణంగా ఆ క్రెడిట్ లైన్‌ను PhonePe UPIకి లింక్ చేయడానికి మీకు మేము అనుమతిని ఇవ్వవచ్చు. PhonePe UPIకి క్రెడిట్ లైన్‌ను లింక్ చేయడానికి సంబంధించి, PhonePe యాప్‌లో అవసరమైన కొన్ని దశలను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. PhonePe UPIకి మీ క్రెడిట్ లైన్ విజయవంతంగా అనుసంధానించిన తర్వాత, క్రెడిట్ లైన్ ద్వారా పేమెంట్లను స్వీకరించే ఆప్షన్‌ను ఎంచుకున్న మర్చెంట్(ల)కు మీరు పేమెంట్(లు) చేయగలరు. అయితే ఆ క్రెడిట్ లైన్‌ను PhonePe యాప్‌లో నమోదు చేసుకున్న మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయిన PhonePe UPIకి మాత్రమే లింక్ చేయగలరని దయచేసి గమనించండి.
మీరు PhonePe యాప్‌లోని సంబంధిత విభాగంలో, PhonePe ఈ సదుపాయాన్ని ఎనేబుల్ చేసిన జారీ చేసే బ్యాంకుల జాబితాను చూడవచ్చు. మీకు క్రెడిట్ లైన్‌ను జారీ చేసిన బ్యాంక్‌ను ఎంచుకున్న తర్వాత, PhonePe మీ క్రెడిట్ లైన్ వివరాలను పొందుతుంది. దీన్ని పూర్తి చేయడం కోసం, మీ క్రెడిట్ లైన్‌కు సంబంధించిన వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. దీని కోసం మీ ఫోన్ నుంచి ప్రత్యేకమైన SMSను పంపించేందుకు మీ మొబైల్ నెట్‌వర్క్‌కు అనుమతి ఇస్తున్నారు, అలానే దీనికి సాధారణమైన SMS ఛార్జీలు వర్తించవచ్చు. అవసరమైన దశలను పూర్తి చేసిన తర్వాత, అటువంటి క్రెడిట్ లైన్‌కు సంబంధించి ఒక ప్రత్యేకమైన VPA తయారవుతుంది, అలానే PhonePe యాప్‌తో ఆ క్రెడిట్ లైన్ లింక్ అవుతుంది. పైన పేర్కొన్న పద్ధతిలో PhonePe యాప్‌లోని PhonePe UPIకి మీ జారీ చేసే బ్యాంక్ మంజూరు చేసిన అటువంటి మల్టిపుల్ క్రెడిట్ లైన్(లు)ను చేర్చే అవకాశం మీకుంటుంది.
VPAని రూపొందించిన తర్వాత, PhonePe యాప్‌కు లింక్ చేసిన మీ క్రెడిట్ లైన్‌కు UPI పిన్‌ను సెట్ చేయాలి. దీని కోసం PhonePe అందుబాటులో ఉంచిన పద్ధతు(ల)ను ఎంచుకోవచ్చు. PhonePe యాప్‌తో లింక్ చేసిన క్రెడిట్ లైన్‌కు UPI పిన్‌ను సెట్ చేయడానికి ఎంచుకున్న పద్ధతిని బట్టి, మీ ఖాతా, డెబిట్ కార్డ్ వివరాలు మొదలైన వాటితో సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా, క్రెడిట్ లైన్‌కు సంబంధించిన వివరాలను ధృవీకరించండని PhonePe మిమ్మల్ని కూడా అడగవచ్చు. ఆ తర్వాత PhonePe యాప్‌లో లింక్ అయిన మీ క్రెడిట్ లైన్‌కు UPI పిన్‌ను సెట్ చేయండి.
PhonePe UPIను ఉపయోగించి క్రెడిట్ లైన్ పేమెంట్(ల)ను ఎనేబుల్ చేసిన మర్చెంట్(ల)కి పేమెంట్(లు) చేయడానికి, మీరు UPI పిన్‌ను ఎంటర్ చేసి, ఆ పేమెంట్లను ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. PhonePe UPIకి లింక్ అయిన మీ క్రెడిట్ లైన్‌ను ఉపయోగించి ఎనేబుల్ చేసిన మర్చెంట్‌లకు మాత్రమే పేమెంట్లు చేస్తారని, అలానే ఏదైనా ఇతర పేమెంట్(లు)(వ్యక్తులకు నగదు బదిలీలు, బ్యాంక్ ఖాతా బదిలీ/నగదు ఉపసంహరణతో సహా, వీటికే పరిమితం కాకుండా) చేయడానికి ఉపయోగించరని మీరు అంగీకరిస్తున్నారు.
ఇకపై, మీరు కింద ప్రస్తావించిన వాటికి లోబడి ఉండేందుకు అంగీకారం తెలుపుతున్నారు: (i) మీ జారీ చేసే బ్యాంక్ తప్పనిసరి చేసిన క్రెడిట్ లైన్ పరిమితి, అలానే (ii) NPCI ద్వారా UPI లావాదేవీలకు వర్తించే అటువంటి లావాదేవీల పరిమితి(లు).
దీనికి తోడు, మీ లింక్ చేసిన క్రెడిట్ లైన్‌లో ‘అందుబాటులో ఉన్న/క్రెడిట్ లైన్ బ్యాలెన్స్’ను చెక్ చేసే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సదుపాయం కింద, జారీ చేసే బ్యాంక్ మంజూరు చేసిన ‘అందుబాటులో/క్రెడిట్ లైన్ బ్యాలెన్స్’ను చూపిస్తాము, అలానే దానికి సంబంధించిన వ్యత్యాసాలు, లోపం(లు), తప్పుడు సమాచారానికి మేము బాధ్యత వహించము అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు PhonePe యాప్‌లో లావాదేవీ వివరాల కింద ఉన్న History/చరిత్ర విభాగం కింద PhonePe UPIకి లింక్ అయిన క్రెడిట్ లైన్ ద్వారా చేసిన పేమెంట్(ల) చరిత్రను కూడా చూడవచ్చు.
మీరు ఈ కింది విషయాలను అంగీకరిస్తున్నారు:
- మీకు, అలానే జారీ చేసే బ్యాంకుకు మధ్య కుదిరిన ఒప్పందంలోని నియమాల ప్రకారంగా, క్రెడిట్ లైన్‌ను మీ జారీ చేసే బ్యాంక్ ఎనేబుల్ చేసింది. క్రెడిట్ లైన్‌కు సంబంధించి క్రెడిట్ పరిమితిని నిర్ధారించడానికి కావాల్సిన అర్హత ప్రమాణాలను నిర్ణయించడంలోPhonePeకు ఎలాంటి పాత్ర లేదు మరియు/లేదా దానికి సంబంధించిన నష్టాలకు బాధ్యత వహించదు. PhonePe, కేవలం PhonePe యాప్ ద్వారా క్రెడిట్ లైన్‌ను PhonePe UPIకి లింక్ చేయడానికి మాత్రమే మీకు అనుమతిస్తుంది, అలానే మీకు, జారీ చేసే బ్యాంకుకు మధ్య కుదిరిన ఒప్పంద నియమం(ల)ను నిర్ణయించడానికి లేదా ధృవీకరించడానికి సంబంధించిన ఏవైనా నష్టాలకు బాధ్యత వహించదు.
- ఈ సదుపాయం కింద PhonePe UPIతో లింక్ అయిన క్రెడిట్ లైన్‌ను ఉపయోగించి మీరు వాడుకున్న ఏ మొత్తం అయినా కూడా సంబంధిత ఎనేబుల్ చేసిన మర్చెంట్‌కు చెల్లించబడుతుంది. మీరు క్రెడిట్ లైన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను, జారీ చేసే బ్యాంక్ పంపించిన బిల్లు(ల)లో పేర్కొన్న గడువు తేదీ లోపు, అలానే దానికి సంబంధించి జారీ చేసే బ్యాంక్(లు) తెలిపిన పద్ధతిలో చెల్లించవలసి ఉంటుంది.
ఒకవేళ మీరు PhonePe యాప్‌ను ఉపయోగించి క్రెడిట్ లైన్ UPI ద్వారా చెల్లించిన ఫార్వార్డ్ పేమెంట్(ల)కు సంబధించిన ఏవైనా రీఫండ్లు రావాల్సి వస్తే, వాటిని మీకు, మీ జారీ చేసే బ్యాంకుకు మధ్య కుదిరిన ఒప్పందంలోని నియమాల ప్రకారం క్రెడిట్ లైన్‌లో జమ అవుతాయి/సర్దుబాటు అవుతాయి.
PhonePe యాప్‌లో PhonePe UPI ద్వారా మీ క్రెడిట్ లైన్‌ను ఉపయోగించి చేసిన లావాదేవీ(ల)కు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే, వాటిని PhonePe UPI వినియోగ నియమాలలోని వివాదాలు – ఫిర్యాదుల విభాగంలో ప్రస్తావించిన ప్రక్రియ ప్రకారం, ఇంకా UPI లావాదేవీలకు సంబంధించి NPCI (ఎప్పటికప్పుడు ప్రకటించే) సూచించిన ఏదైనా ఇతర ప్రక్రియ ప్రకారం పరిష్కారమవుతాయి. ఏవైనా రీఫండ్లు/రివర్సల్స్ UPI లావాదేవీ(ల)కి వర్తించే టైమ్‌లైన్‌ల ప్రకారం పూర్తవుతాయి.
వివాదం & ఫిర్యాదు
PhonePeకి స్పాన్సర్ చేస్తున్న PSP బ్యాంకులు, NPCIతో త్రైపాక్షిక కాంట్రాక్టువల్ ఒప్పందాలు ఉన్నాయి. మా UPI అప్లికేషన్‌లో ఆన్‌బోర్డ్ అయిన కస్టమర్లు ఫిర్యాదులు చేయడానికి అవసరమైన ప్రక్రియను / ఫిర్యాదుల పరిష్కారాన్ని అందించే బాధ్యతను మేము తీసుకుంటాము.
మేము ఆన్‌బోర్డ్ చేసిన కస్టమర్లు లేవనెత్తే UPI సంబంధిత ఫిర్యాదులను/సమస్యలను పరిష్కరించడానికి ముందుగా మా స్థాయిలోనే ప్రయత్నిస్తాము. వాటిని మా దృష్టికి తేవాలి. ఫిర్యాదు/సమస్య పరిష్కారం కానట్లయితే, తదుపరి స్థాయిలో PSP బ్యాంక్, ఆ తర్వాత బ్యాంక్ (మీ అకౌంట్ నిర్వహిస్తున్న బ్యాంక్), చివరిగా NPCIకి మీరు ఫిర్యాదు చేయాలి. ఇక్కడ ప్రస్తావించిన క్రమంలో అన్ని దశలను ప్రయత్నించిన తర్వాత, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను మరియు / లేదా డిజిటల్ ఫిర్యాదుల కోసం నియమితులైన అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
వివాద పరిష్కార విధానం
- PhonePe యాప్‌లో UPI లావాదేవీకి సంబంధించిన ఫిర్యాదును మీరు చేయవచ్చు.
- సంబంధిత UPI లావాదేవీని మీరు ఎంచుకుని, దానికి సంబంధించి ఫిర్యాదును చేయవచ్చు.
- PhonePe యాప్‌లో UPI లావాదేవీ చేసిన సందర్భంలో ఏదైనా సమస్య తలెత్తితే, UPI సంబంధిత ఫిర్యాదులు / సమస్యలు అన్నింటికీ సంబంధించి PhonePeకి ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదు/సమస్య పరిష్కారం కానట్లయితే, తదుపరి స్థాయిలో PSP బ్యాంక్, ఆ తర్వాత బ్యాంక్ (మీ ఖాతా నిర్వహిస్తున్న బ్యాంక్), చివరిగా NPCIకి మీరు ఫిర్యాదు చేయాలి. ఇక్కడ ప్రస్తావించిన క్రమంలో అన్ని దశలను ప్రయత్నించిన తర్వాత, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను మరియు / లేదా డిజిటల్ ఫిర్యాదుల కోసం నియమితులైన అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
- రెండు రకాల లావాదేవీలు, అంటే ఫండ్ బదిలీ, మర్చెంట్ లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు.
- PhonePe యాప్‌లో మీ ఫిర్యాదు స్టేటస్‌ను అప్‌డేట్ చేస్తాము లేదా ఈమెయిల్, టెలిఫోన్ వంటి ఇతర మార్గాలలో PhonePe మీకు సమాచారాన్ని తెలియజేస్తుంది.
ఎంటిటీ | ఫిర్యాదు పరిష్కారం కోసం సంప్రదించాల్సిన లింక్ |
---|---|
PSP బ్యాంక్ | Yes బ్యాంక్ https://www.yesbank.in/contact-us యాక్సిస్ బ్యాంక్ https://www.axisbank.com/contact-us/grievance-redressal/retail-banking-grievance-redressal ICICI బ్యాంక్ https://www.icicibank.com/complaints/complaints.page |
NPCI | https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism |
గ్రూప్ కంపెనీల వినియోగం
PhonePe ప్లాట్‌ఫామ్‌లలో పేర్కొన్న ఏవైనా PhonePe సేవలను మీకు అందించడం కోసం PhonePe, PhonePe సంస్థలు తమ సేవలను ఉపయోగించుకునే హక్కును కలిగి ఉన్నాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
నష్టపరిహారం & బాధ్యత
PhonePe UPI సౌకర్యాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించడం రాకపోవడం వల్ల పరోక్షంగా, పర్యవసానంగా, యాదృచ్ఛికంగా, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు, లాభాలు లేదా ఆదాయాల నష్టం, వ్యాపారానికి అంతరాయం, వ్యాపార అవకాశాలు కోల్పోవడం, డేటా పోగొట్టుకోవడం, ఒప్పందంలో కానీ, నిర్లక్ష్యం కారణంగా, హక్కుల అతిక్రమణ లేదా ఇతరత్రా అంశాలలో, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం వంటి అంశాల వల్ల సంభవించిన నష్టానికి మాత్రమే పరిమితం కాకుండా, ఈ తరహా ఘటనలలో జరిగిన నష్టానికి PhonePe బాధ్యత వహించదు.
PhonePe, PhonePe ఎంటిటీలు, దాని యజమాని, లైసెన్స్, అనుబంధ సంస్థలు, సబ్సిడరీలు, గ్రూప్ కంపెనీల (వర్తించే విధంగా)కు, వాటి సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు మీరు ఎటువంటి హాని తలపెట్టకూడదు, తలపెడితే అందుకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా క్లెయిమ్‌కు లేదా డిమాండ్‌కు సంబంధించిన మొత్తాన్ని; లేదా థర్డ్ పార్టీ చెల్లించిన సహేతుకమైన న్యాయవాది ఫీజును; వినియోగ నియమాలను, ప్రైవసీ పాలసీని, ఇతర పాలసీలను లేదా ఏదైనా చట్టాన్ని, థర్డ్ పార్టీ నియమాలను లేదా నిబంధనలను లేదా హక్కులను (మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనతో సహా) మీరు ఉల్లంఘించిన కారణంగా మీపై విధించిన జరిమానాకు మీరే బాధ్యులు, దానికి నష్టపరిహారాన్ని మీరే చెల్లించాలి.
రద్దు చెయ్యడం
వినియోగ నియమాలను మీరు ఉల్లంఘించినట్లుగా మేము నిర్ధారించినట్లయితే, PhonePe తన సొంత నిర్ణయం ప్రకారం ముందస్తు సమాచారం లేకుండానే మీ ఒప్పందాన్ని రద్దు చేయగలదని, PhonePe అప్లికేషన్‌ను మీరు యాక్సెస్ చేయడంపై పరిమితులు విధించగలదని మీరు అంగీకరిస్తున్నారు. మీ చర్యల కారణంగా PhonePe నష్టాలను చవిచూస్తే, ఆ ఆర్థిక పరమైన నష్టాలకు మాత్రమే ఆ నష్టం పరిమితం కాదని, మేము పేర్కొన్న ఆ పరిస్థితులలో అవసరమైన మేరకు ఇంజంక్టివ్ రిలీఫ్ లేదా చట్టపరమైన ఇతర చర్య తీసుకోవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. PhonePe, PhonePe ఎంటిటీలు నిర్వహిస్తున్న PhonePe ప్లాట్‌ఫామ్‌లలో పాటించాల్సిన యూజర్ ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిన సందర్భంలో మేము సేవలను నిలిపివేయవచ్చు లేదా మీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయవచ్చు.
UPI పేమెంట్ సిస్టమ్ అనుమతి మేరకు మీ రిజిస్ట్రేషన్ సమాచారం, VPAలు, లావాదేవీల సమాచారం లేదా ఇతర సమాచారాన్ని మేము స్టోర్ చేస్తాము. PhonePeతో మీ కాంట్రాక్ట్ ముగిసిన తరువాత కూడా నిబంధనలలో పేర్కొన్న నిర్దిష్ట సమయం వరకు లేదా ఎప్పటికప్పుడు NPCI సూచించిన కాలవ్యవధి వరకు స్టోర్ చేసే అధికారం PhonePeకి ఉంటుందని మీరు గమనించాలి.
పాలక చట్టం
ఈ ఒప్పందం, ఇంకా దాని కింద ఉన్న హక్కులు, బాధ్యతలు, పార్టీల మధ్యనున్న సంబంధాలు, ఈ వినియోగ నియమాల కింద లేదా దానికి సంబంధించి ఉత్పన్నమయ్యే అంశాలు అన్నీ, అంటే కన్‌స్ట్రక్షన్, వ్యాలిడిటీ, పనితీరు లేదా నిలిపివేయడం వంటివి అన్నీ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా చట్టాల ప్రకారం పర్యవేక్షించబడతాయి, భాష్యం చెప్పబడతాయి. ఈ చట్టాల ప్రకారమే వాటిని అర్థం చేసుకోవాలి. మీ PhonePe సేవలకు సంబంధించి తలెత్తే వివాదాలన్నీ కర్ణాటకలోని బెంగళూరులోని కోర్టుల ప్రత్యేక అధికార పరిధి కిందకు వస్తాయి.
డిస్‌క్లెయిమర్లు
NPCI ప్లాట్‌ఫామ్, PSP, PhonePeలను ఉపయోగించి UPI పేమెంట్ సౌకర్యాన్ని పొందేందుకు అనుమతించే నియమాలు ఏవీ కూడా మిగిలిన NCPI సిస్టమ్ పార్టిసిపెంట్‌ల్లో ఏ ఒక్క పార్టిసిపెంట్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఒప్పంద పూర్వకమైన తప్పనిసరి బాధ్యతలను క్రియేట్ చేయవని, ఇంకా PhonePe యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా ఉపయోగించినంత మాత్రానే మీకు PhonePe UPI పేమెంట్ సౌకర్యం పొందేందుకు ఆటోమేటిక్‌గా అర్హత రాదని మీరు అర్థం చేసుకున్నారు.
UPI పేమెంట్ సౌకర్యం నాణ్యత, లభ్యత గురించి మేము ఎటువంటి వారెంటీలు ఇవ్వము. దానికి మేము ప్రాతినిథ్యం వహించము.
మేము నిర్వచించిన ప్రక్రియ ప్రకారమే లావాదేవీలను నిర్వహించడానికి, ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తాము. ప్రతిస్పందన లేకపోవడం, ఆలస్యం కావడం, సిస్టమ్‌ల వైఫల్యం లేదా ఏవైనా ఇతర పరిస్థితులకు మేము బాధ్యత వహించము.
మీ లావాదేవీ రికార్డులు, ఇతర లాగ్స్ సమాచారాన్ని మేము నిర్వహిస్తాము. మీరు వినియోగించిన దానికి, ఇంకా మీరు చేసిన లావాదేవీలకు రుజువుగా ఈ సమాచారం తుది సాక్ష్యంగా ఉంటుంది. బాధ్యులుగా నిలుపుతుంది.